సుమ షోలో గొడవ పడిన జబర్దస్త్ భామలు.. అసలేం జరిగిందంటే?

యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న షోలలో క్యాష్ షో ఒకటనే సంగతి తెలిసిందే.తాజాగా రిలీజైన క్యాష్ షోకు శ్రీసత్య – వర్ష, అంకిత – లహరి, స్రవంతి – ఐశ్వర్య, రోహిణి వచ్చారు.

 Jabardasth Rohini And Varsha Fight In Cash Show Promo Viral, Cash Show Promo,goe-TeluguStop.com

సుమ వర్షను చూస్తూ మొన్నేంటి లక్డీకపూల్ సెంటర్ లో కనిపించావంటూ బిచ్చగత్తె గెటప్ లో వర్ష కనిపించడం గురించి కామెంట్ చేశారు.ఆ తర్వాత వర్ష సుమ సీక్రెట్ చెప్పాలని కోరగా సుమ వర్షను రివర్స్ లో లక్డీకపూలో ఏం చేశావో చెప్పాలని అడుగుతుంది.

వర్ష అడుక్కున్నా అంటూ సిగ్గు పడుతూ సమాధానం చెబుతుంది.ఆ తర్వాత అక్కా నీ కాలికి ఏమైంది కుంటుతున్నావ్ అని వర్ష సుమను అడగగా వయసైపోయిందని మరో సెలబ్రిటీ కామెంట్ చేస్తారు.

ఆ తర్వాత వర్ష స్టేజ్ ఊగుతుంది సెట్ ఊగుతుంది నువ్వు ఊగుతున్నావ్ అని రోహిణి గురించి కామెంట్ చేయగా రోహిణి నేను వచ్చిందే ఊపడానికి అని చెబుతారు.ఆ తర్వాత పట్టుకుంటే పాతచీర పేరుతో సుమ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది.

సుమ రియల్ లైఫ్ లో పెళ్లైందా అని వర్షను అడగగా ఐదు పెళ్లిళ్లు అయ్యాయని వర్ష చెప్పడంతో సుమ వర్ష ముఖంపై పాత చీర పడేస్తుంది.

రోహిణి సుమపై పంచ్ లు వేస్తూ కడుపుబ్బా నవ్వించారు.వర్ష ఇమ్మాన్యుయేల్ కు ఫోన్ చేయగా ఇమ్మాన్యుయేల్ వర్ష ఫోన్ చేస్తే గుండెలు దడదడ ఉంటుందని చెబుతాడు.ఆ తర్వాత వర్ష రోహిణిని బండ అని పిలుస్తారు.

బండ అంటే ఎత్తి అలా వేసేస్తాను అని రోహిణి వర్షపై పంచ్ వేస్తారు.నువ్వు సన్నగా ఉంటావు అది నీ శరీరతత్వం అని రోహిణి చెప్పగా వర్ష రోహిణి ఉంటే నేను షోకు రానని అంటారు.ఆ తర్వాత వర్ష బయటకు వెళతానని చెప్పగా రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube