జబర్దస్త్ స్టార్ కమెడియన్ కి కరోనా..?! అందుకేనా కనిపించట్లేదు..!- Jabardasth Rocket Raghava Rumors

Rumors on Jabardasth Star Comedian Rocket raghava, Covid Positive, Jabardast Show, Rocket raghava,Jabardasth Skits - Telugu Covid Positive, Covid-19, Etv Shows, Jabardast Show, Jabardasth Skits, Rocket Raghava, Rumors On Jabardasth Star Comedian Rocket Raghava

కరోనా వైరస్ మన దేశంలో ఎంతో కలకలం రేపింది.దేశ ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 Jabardasth Rocket Raghava Rumors-TeluguStop.com

ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ ప్రభావం మన దేశంలో తగ్గుముఖం పట్టింది అనే చెప్పాలి.ఎందుకంటే ఒకప్పుడు ప్రతి రోజు 90 వేల కేసులు నమోదు అయ్యేవి.

కానీ ఇప్పుడు అవి 15 వేలకు తగ్గిపోయాయి.కరోనా కి కనికరం లేదు.

 Jabardasth Rocket Raghava Rumors-జబర్దస్త్ స్టార్ కమెడియన్ కి కరోనా.. అందుకేనా కనిపించట్లేదు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎవరయినా ఒకటే.సాధారణ ప్రజలతో పాటు చాలా మంది పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు.

కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు.అయితే ఇప్పుడు కరోనా కల్లోలం జబర్దస్త్ ని పెట్టిందనే చెప్పాలి.

అందులో నటించే ఓ స్టార్ కమెడియన్‌కు కరోనా సోకడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు బుల్లితెర వర్గాల నుంచి సమాచారం.ఇక ఆయన మరెవరో కాదు రాకెట్ రాఘవ.

కొన్ని రోజులగా కరోనా కారణంగా ఈయన ఇంటికే పరిమితమయ్యారు.అందుకే జబర్దస్త్‌కు తాత్కాలికంగా దూరమయినట్లు తెలుస్తోంది.

అయితే రాఘవకి కరోనా సోకిందని నెటిజన్లు బలమైన ఆధారమే చూపెడుతున్నారు.
జబర్దస్త్ కామెడీ షో 2013లో మొదలయింది.

ఈ ఏడేళ్లలో ఎంతో మంది జబర్దస్త్ కు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కూడా.కానీ, రాకెట్ రాఘవ మాత్రం జబర్దస్త్ ని వీడలేదు.

అంతేకాదు ఒక్క వారం కూడా రాఘవ స్కిట్ అనేది మిస్ కాకుండా చేసి ఒక రికార్డుని సాధించాడు.ఈ ఘనత కేవలం ఒక్క రాకెట్ రాఘవకే సొంతం.

జబర్దస్త్ లో నటిస్తున్న వారు ఎప్పుడో ఒకసారి అయిన స్కిట్ చేయకుండా ఆగిపోయారు.కానీ, రాఘవ మాత్రం ఒక్క స్కిట్టూ మిస్ కాలేదు.

కానీ ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆయన మొట్టమొదట సారి జబర్దస్త్‌ ఎపిసోడ్ కు దూరమయ్యాడు.ఇందులో భాగంగానే ఈ గురువారం ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్‌లో మాత్రం రాకెట్ రాఘవ స్టేజిపై కనిపించలేదు.

అతటి టీమ్ సభ్యులు మాత్రమే జబర్దస్త్ స్టేజిపై కనిపించారు.ఈ స్క్రిప్ట్ లో భాగంగా రాఘవ మాత్రం స్టేజి మీద కాకుండా తెరపై కనిపిస్తూ కామెడీ చేశాడు.

అలా అని ఆయన అందుబాటులో లేడేమో, లేక ఎక్కడికన్నా వెళ్ళడేమో అనుకుంటే పప్పులో కాలువేసినట్లే.ఎందుకంటే మన రాకెట్ రాఘవ ఎక్కడికి వెళ్ళలేదు సుమా.

తన ఇంట్లోనే ఉన్నాడు.

ఇంటి నుంచే వర్చువల్‌గా తెరపై స్కిట్ చేశాడు.ఇలా చేయడం వలనే నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.రాఘవ అందుబాటులో ఉంటే స్టేజి మీద స్కిట్ చేయకుండా ఎందుకు ఇంట్లో వర్చువల్‌ గా స్కిట్ చేసాడనే ప్రశ్న అందరిలో మెదులుతుంది.

రాఘవకి కరోనా సోకడం వలన ఐసోలేషన్‌ లో ఉన్నాడని అందుకే ఇలా స్కిట్ చేశాడని అంటున్నారు.ఇంకో విషయం కూడా గమనించాలిసినదే.అది ఏంటంటే వచ్చే వారం ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలయింది.అసలు అందులో అయితే రాకెట్ రాఘవ కనిపించలేదు.

టీమ్ సభ్యులు అందులో లేరు.అందుకే వచ్చే వారం స్కిట్‌ లేదని ప్రచారం జరుగుతోంది.

దీనిని బట్టి ఆయనకు కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి.అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఎందుకంటే రాఘవ గాని, జబర్దస్త్ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు దీని గురించి స్పందించలేదు.

#RumorsOn #Etv Shows #Rocket Raghava #COVID-19 #COVID Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు