కుటుంబానికి దూరంగా ఉంటున్న జబర్దస్త్ రీతూ.. తెర వెనుక కష్టాలు చెబుతూ ఎమోషనల్?

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తన టాలెంట్ తో బుల్లితెర అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న జబర్దస్త్ రీతూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రదీప్ నిర్వహించినటువంటి పెళ్లిచూపులు కార్యక్రమం ద్వారా ఫేమస్ అయ్యారు.

అప్పటినుంచి ఒక వైపు సోషల్ మీడియాలో మరోవైపు బుల్లితెరపై ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈమె జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా రీతు చౌదరి గత కొద్ది రోజుల క్రితం తన ప్రియుడు శ్రీకాంత్ ను పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.తాను ప్రేమించిన శ్రీకాంత్ అనే కుర్రాడు బాగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అబ్బాయని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రకటించారు.ఇకపోతే తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈటీవీ వాళ్ళు హలో బ్రదర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర నటీనటులు అందరూ కూడా పాల్గొని వారి సోదరులకు రాఖీలు కట్టి సెలబ్రేట్ చేసుకున్నారు.

Advertisement

ఇకపోతే యాంకర్ శ్రీముఖి రీతూ మీ అన్నయ్య ఎక్కడ అని అడగా ఒక్కసారిగా ఈమె ఎమోషనల్ అవుతూ తన కష్టాలను చెప్పుకున్నారు.నిజానికి తన కుటుంబ సభ్యులకు తాను ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదని అయితే తనకు ఈ ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం కావడంతో తన కుటుంబాన్ని ఎదిరించి ఇక్కడికి వచ్చానని, అందుకే తనకోసం ఎవరూ రారంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ సమయంలో శ్రీముఖి రీతూ నీకు ఒక సర్ప్రైజ్ అంటూ ఉండగా వెంటనే వెనకనుంచి తన అన్నయ్య అమ్ములు అంటు వేదిక పైకి వచ్చారు.

ఇలా ఒక్కసారిగా రీతూ తన అన్నయ్యని చూసేసరికి ఎమోషనల్ అవుతూ తనని గట్టిగా హత్తుకొని ఏడ్చేశారు.అనంతరం తన అన్నయ్యకు రాఖీ కట్టి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు