జబర్దస్త్ రాకేష్ ను బకరా చేసిన ప్రముఖ యాంకర్..?

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాకింగ్ రాకేష్.బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు జోర్దార్ సుజాత.

 Jabardasth Rakesh Home Tour Video With Sujatha, Rocking Rakesh, Jordar Sujatha,-TeluguStop.com

తాజాగా రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతతో హోం టూర్ వీడియో చేయగా ఆ వీడియోలో రాకేష్ ను ఆమె బకరా చేశారు.చివర్లో సుజాత ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను సైతం అవక్కయ్యేలా చేసింది.

రాకింగ్ రాకేష్ తన సొంత యూట్యూబ్ ఛానల్ చంటబ్బాయ్ ద్వారా సుజాత హోం టూర్ వీడియో షేర్ చేశారు.సుజాత ఇల్లు చూడటానికి విలాసవంతంగా ఉంది.

స్టార్ హీరోల, హీరోయిన్ల ఇళ్లలా ఖరీదైన ఫర్నీచర్ తో కళ్లు జిగేల్ అనేలా ఉంది.కిచెన్ ను చూపిస్తూ తాను కిచెన్ ను పెద్దగా ఉపయోగించనని ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేసుకుని తింటానని ఆమె అన్నారు.

ఇంటి డిజైన్, ఆర్కిటెక్చర్ చూస్తే సుజాత యాంకరింగ్, బిగ్ బాస్ షో ద్వారా కోట్లు సంపాదించిందా అనే అనుమానం ప్రేక్షకులకు కలుగుతుంది.

Telugu Jordar Anchor, Prank-Movie

రాకింగ్ రాకేష్ సుజాత ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్ గా నటించినట్టు క్యూట్ అబద్ధం చెప్పిందని తెలిపారు.జబర్దస్త్ లో పిల్లలతో చేయకపోవడం గురించి రాకేష్ స్పందిస్తూ కరోనా వల్ల పిల్లలతో చేయడం లేదని తెలిపారు.ఇంట్లో సుజాత బిగ్ బాస్ మొమెంటోలు ఉండటంతో అందరూ సుజాత చెప్పిన మాటలు కూడా నిజమేనని ఆ ఇల్లు ఆమె ఇల్లేనని నమ్మారు.

ఆ తరువాత రోహిణికి, నీకు మధ్య ఏముందని రాకేష్ ను అడగగా ఇద్దరికీ మధ్య లక్ష రూపాయల అప్పు ఉందని చెప్పారు.

జోర్దార్ సుజాత అమ్మ తనకు అప్పుడప్పుడూ మా అమ్మాయిని చూస్తూ ఉండండని అమాయకురాలని చెప్పిందని కానీ ఈమెకు అన్నీ తెలుసని అన్నారు.

ఆ తరువాత సుజాత ఇది మా ఇల్లు కాదని తన ఫ్రెండ్ ఇల్లు అని చెప్పి రాకేష్ ను బకరాను చేసింది.బిగ్ బాస్ మొమొంటోలు అన్నీ కవర్ లో పెట్టుకుని ఇది మా ఫ్రెండ్ ఇల్లు అని చెబుతుంది.

తాను ఫ్రాంక్ చేశానని రాకేష్ తో ఫ్రాంక్ చేయాలని చాలారోజుల నుంచి అనుకున్నానని సుజాత తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube