బిగ్ బాస్ లోకి జబర్దస్త్ లేడీ.. ఎవరంటే?

బుల్లితెరపై ఆదరణ దక్కించుకుంటూ దూసుకుపోతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి.ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.

 Jabardasth Priyanka Singh Will Entry To Bigg Boss Telugu 5 Show-TeluguStop.com

ఈ క్రమంలోనే సెప్టెంబర్ ఐదు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోపాల్గొనే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని,ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సీజన్ ప్రసారం కావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం కానుంది.అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన లోగోలో కొన్ని మార్పులు చేసి విడుదల చేశారు.ఈలోగో చూస్తుంటే ఇది వరకు సీజన్ల మాదిరి కాకుండా ఈసారి మరింత రసవత్తరంగా బిగ్ బాస్ కొనసాగనుందని తెలుస్తోంది.

 Jabardasth Priyanka Singh Will Entry To Bigg Boss Telugu 5 Show-బిగ్ బాస్ లోకి జబర్దస్త్ లేడీ.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటివరకు ఐదో సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ వీళ్ళే అంటూ కొందరు పేర్లు వినిపించాయి.తాజాగా బిగ్ బాస్ ఐదవ సీజన్ లోకి జబర్దస్త్ లేడీ ఎంట్రీ ఇవ్వనుందనే సమాచారం వినబడుతోంది.

Telugu Bigg Boss, Biggboss 5, Jabardasth, News Season, Priyanka Singh, Reality Show, Tv Show-Movie

ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ జబర్దస్త్ సాయి తేజ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలోకి ఒక ట్రాన్స్ జెండర్ కంటెస్టెంట్ గా పంపించడంతో బిగ్ బాస్ దృష్టిలో అందరూ సమానమేనని నిర్వాహకులు చెప్పకనే చెప్పేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పై కూడా ప్రియాంక సింగ్ సంతకాలు చేసినట్టు తెలుస్తోంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా రానా వ్యవహరిస్తున్నారని తెలిసినప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

అయితే గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

#Bigg Boss #Priyanka Singh #Reality Show #Jabardasth #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు