భార్య గర్భిణీ.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న జబర్దస్ కమెడియన్..

తెలుగు బుల్లితెర మీద జబర్దస్త్ కలిగించిన నవ్వుల హడావిడి మామూలుగా లేదు.ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు.

 Jabardasth Prasad Unknown Struggles , Jabardasth, Prasad, Comedians, Sunita, To-TeluguStop.com

ఏండ్ల తరబడి అద్భుతమైన కామెడీతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ షోగా ముందుకు సాగుతోంది.అందులోని కమెడియన్లు జనాలను ఎంతగానో నవ్విస్తున్నారు.

అయితే వారిలో కొందరి నిజ జీవితాలు మాత్రం ఎన్నో కష్టాలు నిండి ఉన్నాయి.అలాంటి వారిలో ఒకడే పంచ్ ప్రసాద్.

జబర్దస్త్ లో ప్రసాద్ మంచి కామెడితో పాటు అద్భుతమైన టైమింగ్ తో అందరినీ నవ్విస్తాడు.స్టేజి మీద నవ్వించే ప్రసాద్ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలున్నాయి.

తన ఆస్తి మొత్తం వైద్యానికి ఖర్చు కావడంతో నానా ఇబ్బందులు పడ్డాడు.ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కూడా సరిగ్గా చూసుకోలేక పోతున్నాను అని బాధపడి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట.

అయితే తనకు జబర్దస్త్ ఫ్యామిలీతో పాటు నాగబాబు అండగా నిలబడ్డంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు చెప్పాడు.

ప్రసాద్ కు సునీత అనే అమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది.

వీరిద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.అయితే ఇంతలో తన కిడ్నీలు పాడయ్యాయని తేలింది.

సునీత తనను హాస్పిటల్ కు తీసుకెళ్లేది.అయితే ఈ సమస్యచాలా సీరియస్ గా ఉందని పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాడు.

అతడి కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లి చేసుకోవద్దని చెప్పారు.అయినా సునీత మాత్రం వారి మాటలు పట్టించుకోలేదు.

ఎన్ని రోజులు ఉన్నా ఫర్వాలేదని అని ఆమె ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది.హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్.

అయినా ఆస్పత్రిలో తన పక్కనే కూర్చునేది.అయితే ప్రసాద్ మాత్రం అనవసరంగా ఈ పెళ్లి చేసుకున్నట్లు భావించాడు.

తన మూలంగా ఆమె ఇబ్బంది పడుతున్నట్లు అనుకున్నాడట.

ఒకరోజు సూసైడ్ చేసుకుంటానని భార్యతో చెప్పాడట, ప్రసాద్.ఆ సమయంలో తనను నాగబాబు పిలిచి మాట్లాడాడట.అండగా ఉంటానని హామీ ఇచ్చాడట.

అలానే జబర్దస్త్ టీంతో పాటు రోజా కూడా తనకు హెల్ప్ చేసినట్లు వెల్లడించాడు.తన కొడుకు పుట్టిన తర్వాత మరింత ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాడు.

ఆ తర్వాత తనకు ధైర్యం వచ్చినట్లు చెప్పాడు.అంతకు ముందు హైబీపీ ఉన్నట్లు చెప్పాడు.

కొడుకు పుట్టాక తనకు నార్మల్ అయినట్లు చెప్పాడు.ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించాడు.

Jabardasth Prasad Unknown Struggles , Jabardasth, Prasad, Comedians, Sunita, Tollywood - Telugu Comedians, Jabardasth, Prasad, Sunita, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube