అమ్మ రాజశేఖర్ మోసం చేశాడంటున్న జబర్దస్త్ కమెడియన్?  

jabardasth pawan sensational comments on amma rajasekhar master Amma Rajashekar, Jabardasth, Pawan, Baba Baskar, Nithin, Takkari, Ravi Teja Khatarnak, - Telugu Amma Rajashekar, Baba Baskar, Jabardasth, Nithin, Pawan, Ravi Teja Khatarnak, Takkari

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకునిగా అమ్మ రాజశేఖర్ ప్రేక్షకులకు సుపరిచితం.దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న అమ్మ రాజశేఖర్ కు రణం సినిమా మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది.

TeluguStop.com - Jabardasth Pawan Sensational Comments On Amma Rajasekhar Master

గత కొంతకాలం నుంచి సినిమాల ద్వారా యాక్టివ్ గా లేని అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ షోలో పాల్గొని వార్తల్లో నిలిచారు.గత సీజన్ లో బాబా భాస్కర్ లా అమ్మ రాజశేఖర్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తాడని బిగ్ బాస్ నిర్వాహకులు భావించారు.

కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం వాళ్ల అంచనాలను అందుకోలేకపోయాడు.వచ్చే వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ కావాలంటే సగం గుండు.సగం గడ్డం చేయించుకోవాలని నాగార్జున చెప్పగా అమ్మ రాజశేఖర్ అందుకు అంగీకరించి సగం గుండు, సగం గడ్డం చేయించుకున్నాడు.అయితే తాజాగా అమ్మ రాజశేఖర్ తనను మోసం చేశాడంటూ జబర్దస్ట్ కమెడియన్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - అమ్మ రాజశేఖర్ మోసం చేశాడంటున్న జబర్దస్త్ కమెడియన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం అయిన పవన్ సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కు వఛ్చిన కొత్తలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.అప్పట్లో కొరియోగ్రాఫర్ గా ఫామ్ లో ఉన్న అమ్మ రాజశేఖర్ దగ్గర తాను అసిస్టెంట్ గా చేరానని.

అతని బట్టలు ఉతకడం, ఇంట్లో అంట్లు తోమడం లాంటి పనులు కూడా చేశానని చెప్పారు.

రవితేజ ఖతర్నాక్, నితిన్ టక్కరి సినిమాలలో తనకు చిన్న రోల్ లో నటించే అవకాశం ఇస్తాడని అమ్మ రాజశేఖర్ చెప్పిన పనులన్నీ చేశానని.

కానీ ఆయన అవకాశం ఇవ్వలేదని తెలిపారు.ఛాన్స్ కోసం అడిగితే ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా.? అంటూ హేళన చేసి మాట్లాడారని పవన్ వెల్లడించారు.పవన్ ఇంటర్వ్యూలో అమ్మ రాజశేఖర్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#Baba Baskar #Pawan #Amma Rajashekar #Nithin #RaviTeja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jabardasth Pawan Sensational Comments On Amma Rajasekhar Master Related Telugu News,Photos/Pics,Images..