జబర్దస్త్ నరేష్ రెండో పెళ్లి.. అసలు విషయం చెప్పిన శాంతి స్వరూప్!

బుల్లితెరపై ఎంతో విశేష ఆదరణ దక్కించుకుని, టాప్ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటని చెప్పవచ్చు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు వెలుగులోకి వచ్చారు.

 Jabardasth Comedian Naresh To Marry A Bheemavaram Girl Soon, Jabardasth Naresh,-TeluguStop.com

ఈ కార్యక్రమం ద్వారా బాగా గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వెండితెరపై కూడా చేస్తున్నారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో పొట్టి నరేష్ ఒకరు.

పొట్టి నరేష్ చూడటానికి మూడు అడుగులు ఉన్న అతడు వేసే పంచ్ లు మాత్రం భారీగా ఉంటాయి.ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో నరేష్ పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది.

పొట్టి నరేష్ చూడటానికి పొట్టిగా ఉన్న అతనికి పెళ్లిడు వచ్చిందని అయితే ఇప్పటికే అతనికి పెళ్లి జరిగిందనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి.నరేష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు త్రిపురాంబిక అని అయితే పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించిందనే వార్తలు పెద్దఎత్తున వచ్చాయి.

నిజానికి నరేష్ పెళ్లి చేసుకోలేదని నరేష్ పోలికలతోనే అదే ఎత్తులో రమేష్ అనే వ్యక్తి ఉండటంవల్ల చాలామంది రమేష్ ను నరేష్ గా భావించి ఈ విధమైనటువంటి వార్తలు సృష్టించారని తెలియజేశారు.

ఇకపోతే ప్రస్తుతం ఎంతో మంది సెలబ్రిటీలు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలను తీసే వారి ఛానల్ లో పోస్ట్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ శాంతి స్వరూప్ కూడా షైనింగ్ శాంతి అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అతనికి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే శాంతి స్వరూప్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పొట్టి నరేష్ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే శాంతి స్వరూప్ బుల్లెట్ భాస్కర్ నాటీనరేష్, ఫైమా కలిసి రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ చేశారు.

ఈ ఈవెంట్ కి వెళ్తున్న సమయంలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ త్వరలోనే నరేష్ ఇంటివాడు కాబోతున్నారనీ చెప్పడంతో అంతలో బుల్లెట్ భాస్కర్ కలుగజేసుకుని ఈ మధ్యనే పెళ్లి చూపులు కూడా జరిగాయట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ అమ్మాయిది భీమవరం అంటూ తెలియజేశారు.నరేష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు శకుంతల ఆమె డిగ్రీ వరకు చదివిందనీ ఆమె ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలని పేర్కొన్నారు.అయితే ఈ విషయంలో నిజం లేదని నరేష్ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అతని మాటలు పట్టించుకోకుండా వీరిద్దరూ మాట్లాడటంతో నరేష్ పెళ్లి విషయం కాస్త సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube