రష్మీని తల దించుకునేలా చేసిన జబర్దస్త్ నరేష్.. ఏం జరిగిందంటే?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో గత కొన్నేళ్ల నుంచి ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా కమెడియన్ నరేష్ రష్మీని ఇమిటేట్ చేశారు.“అసలేం గుర్తుకురాదు” అనే పాటకు నరేష్ రష్మీ గతంలో ఏ విధంగా డ్యాన్స్ చేసిందో అవే ఎక్స్ ప్రెషన్లు ఇస్తూ డ్యాన్స్ చేశారు.నరేష్ చేసిన డ్యాన్స్ ను చూడలేక రష్మీ సిగ్గు పడుతూ తల దించుకోవడం గమనార్హం.

 Jabardasth Naresh Imitated Rashmi In Extra Jabardasth Show Promo Goes Viral, Jab-TeluguStop.com

నరేష్ డ్యాన్స్ ను చూసి రోజా అమ్మాయి గెటప్ లో నరేష్ చాలా క్యూట్ గా ఉన్నాడని తనకు బుగ్గలు గిల్లాలని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత సుధీర్ లేడీ కంటెస్టెంట్ తో ఎంట్రీ ఇవ్వగా లాస్ట్ వీక్ వచ్చింది అప్పుడే సెట్ చేశావా అని రోజా సుధీర్ ను అడగగా సుధీర్ దండం పెడతాడు.

కెవ్వు కార్తీక్ వీడినెలా ప్రేమించావే అని అడగగా ఒకటే ఒక మాట చెప్పాడని ఆ మాటకే పడిపోయానని ఆమె సమాధానం ఇస్తుంది.

” నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావో లేదో తెలీదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా” ఈ డైలాగ్ చెప్పాడా అని అడగగా ఈ డైలాగ్ చెప్పాడని ఆమె సమాధానం ఇస్తారు.ఆ తర్వాత కెవ్వు కార్తీక్ ఇదే డైలాగ్ నువ్వు ఎంతమందికి చెబుతావని సుధీర్ ను ప్రశ్నిస్తాడు.నాకు ఆ డైలాగ్ మాత్రమే వచ్చని ఆ డైలాగ్ ఇక్కడ వర్కౌట్ అయిందని సుధీర్ చెబుతాడు.

ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ కు జోడీగా వర్ష ఎంట్రీ ఇస్తారు.

బుల్లెట్ భాస్కర్ సుధీర్ తో పెద్దాయన ప్రవచనాలు చెప్పే వీడియోకు మనవాళ్లు నీ గురించి కామెంట్లు పెడుతున్నారని మనవాళ్లకు నువ్వైనా చెప్పు అని భాస్కర్ చెబుతాడు.మొన్న తాను సుధీర్ గురించి ఒకటి చదివానని అందులో ” మా ఇంట్లో బ్రష్ సుధీర్ అన్న ఫ్రెష్” అనే కామెంట్ ఉందని రష్మీ చెబుతూ నవ్వులు పూయించారు.అక్టోబర్ నెల 22వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube