మెగాస్టార్ నుంచి పిలుపొచ్చింది.. భోళా శంకర్ లో ఛాన్స్ కొట్టేసిన జబర్దస్త్ నరేష్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ఎంతో మంది మంచి అవకాశాలు అందుకుని జబర్దస్త్ కార్యక్రమంలో పేరు సంపాదించుకోవడమే కాకుండా వీరికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని వీరికి సినిమా అవకాశాలు రావడం విశేషం.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్లు ప్రస్తుతం వెండితెర పై పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

 Jabardasth Naresh Got A Chance In Megastar Bhola Shankar Movie Details, Jabarda-TeluguStop.com

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో నరేష్ చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ ఆయన వేసే పంచ్ డైలాగులకు విపరీతమైన క్రేజ్ ఉంది.ఆయన అద్భుతమైన కామెడీ టైమింగ్ కి విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పాలి.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన పొట్టి నరేష్ కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నుంచి పిలుపు వచ్చింది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో తనకు అవకాశం కల్పించారని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పొట్టి నరేష్ తెలియజేశారు.

ఈ సందర్భంగా పొట్టి నరేష్ మాట్లాడుతూ తనకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి వేదికగా మారిందని తెలిపారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకు ఎంతో గుర్తింపు లభించిందని తనకు ఎప్పటికైనా ఒక ఇల్లు కారు కొనాలనేదే తన కోరిక అని తెలిపారు.

ప్రస్తుతం తాను కారు కొన్నానని త్వరలోనే ఇంటిని కూడా కొనుగోలు చేస్తున్నానని నరేష్ తెలిపారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Naresh, Meher Ramesh, Nareshbhola, Tollywood-

ఈ ఏడాది తన ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అవుతుందని ఇల్లు కొన్న వెంటనే పెళ్లి కూడా చేసుకుంటానని తెలిపారు.తాను పెళ్లి చేసుకుంటే అది ఒక సెన్సేషనల్ అవుతుందని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం తాను ఇలాంటి పొజిషన్లో ఉండడానికి జబర్దస్త్ టీమ్ తనకు ఎంతో సహాయం చేశారని తెలిపిన ఈయన మెగాస్టార్ కు పెద్ద అభిమాని అన్న విషయాన్ని కూడా బయటపెట్టారు.

ఇలా మెగాస్టార్ కు అభిమానిగా ఉన్న తనకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో స్వయంగా చిరంజీవి గారి తన పేరును రికమండ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని తెలియజేశారు.ఆయనతోపాటు రెండు రోజులపాటు షూటింగ్ లో పాల్గొని సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube