నాగబాబు రీ ఎంట్రీతో 'జబర్దస్త్‌' పెరిగింది

రెండు నెలలుగా బుల్లి తెరపై కనిపించని నాగబాబు ఎట్టకేలకు కనిపించబోతున్నాడు.ఎన్నికల ముందు జబర్దస్త్‌కు దూరం అయిన నాగబాబు ఎన్నికలు పూర్తి అయ్యి రెండు నెలలు అవుతున్నా కూడా రాకపోవడంతో రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

 Jabardasth Nagababu Re Entry In Jabardasth Hikes More Laugh-TeluguStop.com

నాగబాబు జబర్దస్త్‌కు గుడ్‌ బై చెప్పినట్లే అంటూ అంతా అనుకున్నారు.అయితే అనూహ్యంగా నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఎట్టకేలకు వచ్చే వారంలో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో నాగబాబు నవ్వులు చూడవచ్చు.

నాగబాబు రీ ఎంట్రీతో 'జబర్దస్త

నిన్నటి ఎపిసోడ్‌ పూర్తి అయిన తర్వాత ప్రసారం చేసిన వచ్చే వారం ప్రోమోలో నాగబాబు కనిపించాడు.నాగబాబు రీ ఎంట్రీపై ఆది వేసిన పంచ్‌లు, పేల్చిన డైలాగ్‌లకు జనాలు విరగబడి నవ్వేస్తున్నారు.ఆది అన్నట్లుగా జబర్దస్త్‌కు సూర్య చంద్రులు నాగబాబు రోజాలు అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

నాగబాబు రీ ఎంట్రీతో మళ్లీ జబర్దస్త్‌కు పూర్తి కళ వచ్చిందని బుల్లి తెర వర్గాలు మరియు ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాగబాబు రీ ఎంట్రీతో 'జబర్దస్త

మొత్తానికి నాగబాబు ఎంట్రీతో గత కొన్నాళ్లుగా వస్తున్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి.అయితే రోజా విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.రోజాకు మంత్రి పదవి వస్తే జబర్దస్త్‌ను వదిలేయనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక వేళ స్పీకర్‌ పదవి వచ్చినా కూడా జబర్దస్త్‌లో కొనసాగుతుందా అనే చర్చ జరుగుతోంది.ఈ చర్చకు మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ రోజా పోతే నాగబాబుకు జంటగా ఎవరు అయితే బాగుంటుందో కామెంట్‌ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.

నాగబాబు రీ ఎంట్రీతో 'జబర్దస్త .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube