జబర్దస్త్ కొత్త జడ్జి లు మీనా , శేఖర్ మాస్టర్ కి రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసా... రోజా , నాగబాబు ల కంటే ఎక్కువే...  

Jabardasth Judges Meena Sekhar Master Remuneration-jabardasth,jabardasth New Judges,meena,nagababu,roja,shekar Master

జబర్దస్త్ కామెడి షో గత ఆరేళ్లుగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న షో , ఈ షో బుల్లి తెర పైన భారీ హిట్ అయింది , ఇప్పటికి టైం పాస్ కోసం యూట్యూబ్ లలో కూడా కొన్ని లక్షల మంది పాత వీడియోలు చూస్తున్నారు. ఈ షో కి అంత పాపులారిటీ రావడానికి కారణం ఒక వైపు అందులో స్కిట్ లు చేస్తున్న టీం లు అయితే మరోవైపు నాగబాబు , రోజా లు జడ్జ్ లుగా వ్యవహరించడం. ఈ షో ని వాళ్లిద్దరూ లేకుండా ఊహించుకోవడం కష్టమే..

జబర్దస్త్ కొత్త జడ్జి లు మీనా , శేఖర్ మాస్టర్ కి రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసా... రోజా , నాగబాబు ల కంటే ఎక్కువే...-Jabardasth Judges Meena Sekhar Master Remuneration

అయితే ఇప్పుడు ఎన్నికలు కాబట్టి పైగా నాగబాబు ఎంపీ గా పోటీ చేయగా , రోజా ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు దీనితో ఇద్దరు ఎన్నికల ప్రచారం లో బిజీ గా ఉన్నారు

అసలు విషయానికొస్తే ఈ ఇద్దరు ప్రస్తుతం ఎన్నికలలో బిజీ గా ఉండడం వల్ల వీరి స్థానం లో శేఖర్ మాస్టర్ ని మీనా ని కొంత కాలం టెంపరరీ జడ్జ్ లుగా నియమించింది జబర్దస్త్ యాజమాన్యం. జబర్దస్త్ షో కి నాగబాబు , రోజానే జడ్జి లుగా వ్యవహరిస్తుండగా , ఎక్స్ట్రా జబర్దస్త్ కి మీనా , శేఖర్ మాస్టర్ జడ్జి లుగా చేస్తున్నారు.

రోజా కన్నా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మీనా

మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ప్రస్తుతం ఆమె కొన్ని టీవీ షో లలో కనిపిస్తుంది. ఆమెకి ఇప్పటికి మంచి స్టార్ డాం ఉంది. అయితే రోజా అందుబాటులో లేకపోవడం తో మీనా ని తీసుకున్న జబర్దస్త్ యాజమాన్యం ఆమెకి భారీ మొత్తం లో రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు.

రోజా కి ప్రతుతం ఒక్క షో కి 1.4 లక్షలు ఇస్తుండగా ఆమె స్థానం లో వస్తున్న మీనా కి రోజా తో పోలిస్తే ఎక్కువ మొత్తం లొనే ఇవ్వబోతున్నారు. మీనా కి ఒక షో కి 1.5 లక్షల నుండి 1.8 లక్షలు ఇస్తున్నారని సమాచారం.

ఇకపోతే నాగబాబు స్థానం లో వచ్చిన శేఖర్ మాస్టర్ కి కూడా భారీ పారితోషికమే లభించనుంది. ముందుగా ఈ స్థానానికి జానీ మాస్టర్ ని అనుకున్నపతికి ఆయన కొన్ని వివాదాల వల్ల పక్కకి తప్పుకున్నారు. శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఢీ షో కి జడ్జి గా వ్యవహరిస్తున్నారు.