అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్.. ప్రాణాపాయ స్థితిలో..?

ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని ప్రతిభ ఉన్న కమెడియన్లు జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున సంగతి తెలిసిందే.జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్లలో జీవన్ ఒకరు.

 Jabardasth Jeevan Admitted In Hospital Because Of Serious Health Issues-TeluguStop.com

తాజాగా ఒక షోలో రామ్ ప్రసాద్, అదిరే అభి పాల్గొనగా జీవన్ ఆరోగ్యం గురించి వాళ్లు షాకింగ్ విషయాలను వెల్లడించారు.మే నెల 28వ తేదీ తరువాత జీవన్ జబర్దస్త్ లో స్కిట్ చేయలేదనే సంగతి తెలిసిందే.

Telugu Alitho Saradaga Show, Jabardasth Jeevan, Ram Prasad, Serious Health Issues-Movie

చాలామంది జీవన్ ఏదైనా కారణం వల్ల జబర్దస్త్ షోకు దూరమై ఉండవచ్చని భావించగా రామ్ ప్రసాద్ వల్ల జీవన్ అనారోగ్య సమస్యలతో జబర్దస్త్ కు దూరమయ్యాడని తెలుస్తోంది.రామ్ ప్రసాద్ మాట్లాడుతూ అభినయ్ కృష్ణ జబర్దస్త్ షోకు పెద్ద తలకాయలాంటి వ్యక్తి అని ఎవరైనా ఇబ్బందులలో ఉన్నారని తెలిస్తే అభి మొదట స్పందించి తన వంతు సహాయం చేస్తారని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

 Jabardasth Jeevan Admitted In Hospital Because Of Serious Health Issues-అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్.. ప్రాణాపాయ స్థితిలో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏం చెప్పినా అభి ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలో ప్లానింగ్ చెబుతాడని రామ్ ప్రసాద్ తెలిపారు.జీవన్ అనారోగ్య సమస్యల వల్ల ఐసీయూలో ఉన్నారని రామ్ ప్రసాద్ వెల్లడించారు.

డబ్బులను పోగు చేసి అభికి ఇస్తామని రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.జీవన్ ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారని రామ్ ప్రసాద్ తెలిపారు.

డాక్టర్లతో కూడా అభి మాట్లాడేవాడని జీవన్ కుటుంబ సభ్యులు సైతం అభికే కాల్ చేసేవారని రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.

Telugu Alitho Saradaga Show, Jabardasth Jeevan, Ram Prasad, Serious Health Issues-Movie

అయితే ఏ కారణంతో జీవన్ ఆస్పత్రిలో చేరాడనే విషయం మాత్రం తెలియలేదు.జబర్దస్త్ కమెడియన్లు మనల్ని ఎంతో కష్టపడి నవ్విస్తున్నా వాళ్ల మాత్రం ఎన్నో కష్టాలు పడుతుండటం గమనార్హం.జబర్దస్త్ జీవన్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

#SeriousHealth #Ram Prasad #AlithoSaradaga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు