జబర్దస్త్‌ రేటింగ్‌ విషయంలో ఆందోళన  

తెలుగు బుల్లి తెరపై దాదాపుగా ఎనిమిది సంవత్సరాలుగా జైత్ర యాత్ర కొనసాగిస్తున్న జబర్దస్త్‌కు డౌన్‌ ఫాల్‌ ప్రారంభం అయ్యిందనిపిస్తుంది.కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధించిన సమయంలో జబర్దస్త్‌ కామెడీ షో నిలిచి పోయింది.

TeluguStop.com - Jabardasth Hyper Adhi Sudheer Ramprasad

షూటింగ్స్‌ చేసిన కొత్త ఎపిసోడ్స్‌ లేకపోవడం వల్ల నిర్వాహకులు పాత ఎపిసోడ్స్‌ను ప్రసారం చేయడం జరిగింది.ఇప్పుడు కొత్త ఎపిసోడ్స్‌ ప్రసారం అవుతున్నా కూడా జనాలు పట్టించుకోవడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

జబర్దస్త్‌ కామెడీ షో దాదాపు ఏడు సంవత్సరాల పాటు తెలుగు బుల్లి తెరపై సంచలనంగా నిలిచింది.కామెడీ పరంగా సరికొత్త కార్యక్రమంగా నిలిచింది.అలాంటి జబర్దస్త్‌ను గత నాలుగు అయిదు వారాలుగా ప్రేక్షకులు ఆధరించడం లేదు.గతంలో యూట్యూబ్‌లో స్కిట్స్‌కు మిలియన్‌ల కొద్ది వ్యూస్‌ వచ్చేవి.

TeluguStop.com - జబర్దస్త్‌ రేటింగ్‌ విషయంలో ఆందోళన-Movie-Telugu Tollywood Photo Image

కాని ఇప్పుడు ఆ స్థాయిలో రావడం లేదు. హైపర్‌ ఆది మరియు సుడిగాలి సుధీర్‌ కామెడీ స్కిట్స్‌ తప్ప మరెవ్వరి కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయడం లేదు.

ఇతర కామెడీ స్కిట్స్‌ వచ్చిన సమయంలో స్కిప్‌ కొడుతున్నారు.దానికి తోడు నాగబాబు అదిరింది కూడా యూట్యూబ్‌లో పోటీ ఇస్తుంది.శాటిలైట్‌ పరంగా అదిరింది అంతగా రేటింగ్‌ లేదు.కాని జబర్దస్త్‌కు మొన్నటి వరకు ఉండేది.కాని ఈమద్య రావడం లేదు.ఎప్పుడు ఢీ రెండవ స్థానంలో ఉండేది.

కాని ఇప్పుడు ఢీ తర్వాత స్థానంలో జబర్దస్త్‌ ఉంటుంది.దీంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి రెండేళ్లు చూసి దుకాణం బంద్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

#Jabardasth #Sudheer #Nagababu #Hyper Adhi #Adirindi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jabardasth Hyper Adhi Sudheer Ramprasad Related Telugu News,Photos/Pics,Images..