ఆ వ్యక్తి చేతిలో బకరా అయ్యానంటున్న హైపర్ ఆది..!  

jabardasth hyper aadi is cheated in his early career , jabardasth hyper aadi, hyper aadi , real life story, aadi career, dhee champions - Telugu Career Problems, Hyper Aadi, Jabardasth, Jabardasth Hyper Aadi, Jabardasth Hyper Aadi Is Cheated In His Early Career, Lost Money, Real Life Story

బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు హైపర్ ఆది.హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ షోను చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు.

TeluguStop.com - Jabardasth Hyper Aadi Cheated Career

ఆది స్కిట్ల వీడియోలకు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి.సినిమాల్లోనూ, ఈవెంట్లలోను పంచ్ లతో అలరిస్తున్న హైపర్ ఆది కెరీర్ మొదట్లో తనను ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడని, ఆ వ్యక్తి చేతిలో బకరా అయ్యానని చెప్పుకొచ్చారు.
తాజాగా ఒక షోకు గెస్ట్ గా హాజరైన హైపర్ ఆది తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పాడు.సినిమా, టీవీ రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడని.

ఆ వ్యక్తి సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను చూపించి తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెబితే గుడ్డిగా నమ్మానని తెలిపారు.మొదట్లో రీఛార్జ్ ల కోసం, ఇతర అవసరాల కోసం ఆ వ్యక్తి డబ్బులు అడిగేవాడని తెలిపారు.
తనకు పరిచయమైన అప్పుగా తన దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని.ఆ తర్వాత మంచి రోల్ అని రేపటినుంచి షూటింగ్ అని పదివేలు లాగాడని.

TeluguStop.com - ఆ వ్యక్తి చేతిలో బకరా అయ్యానంటున్న హైపర్ ఆది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత రోజు ఆఫీస్ కు వెళితే ఆ ఆఫీస్ కు తాళం వేసి ఉందని తెలిపారు.అవకాశాలు ఇస్తారని నమ్మితే ఆ వ్యక్తి బకరా చేశాడని పరోక్షంగా చెప్పారు.

ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్, ఢీ ఛాంపియన్ షోలతో బిజీగా ఉన్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన హైపర్ ఆది స్వయంకృషితో ఎదిగి టీవీ రంగంలో సినిమాల్లోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

సినిమాల్లో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో బ్రేక్ రాకపోయినా టీవీ రంగంలో మాత్రం హైపర్ ఆది సత్తా చాటుతున్నారు.ఆదివారం టెలీకాస్ట్ అయిన బిగ్ బాస్ షోలో హైపర్ ఆది పాల్గొని సందడి చేశారు.

#JabardasthHyper #Lost Money #Jabardasth #Hyper Aadi #Real Life Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jabardasth Hyper Aadi Cheated Career Related Telugu News,Photos/Pics,Images..