ఈటీవీలో సూపర్ హిట్ కామెడీ షో అయిన జబర్దస్త్ షో దాదాపు ఎనిమిది ఏళ్లుగా సత్తా చాటుతూ వచ్చింది.అందులో చేసిన కమెడియన్స్ అందరు కెరియర్ పరంగా సూపర్ గా సెటిల్ అయ్యారు.
టీం లీడర్ ల దగ్గర నుంచి అందులో కంటెస్టంట్స్ వరకు అందరు లైఫ్ లో బాగానే సెటిల్ అయ్యారు.ఈ క్రమంలో ఇన్నేళ్ల తర్వాత జబర్దస్త్ లో చేయడం అంటే బానిస బ్రతుకే అంటూ హాట్ కామెంట్స్ చేశాడు కిరాక్ ఆర్పీ.
జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పాపులర్ అయిన అతను జబర్దస్త్ నుంచి మూడు నాలుగేళ్ల క్రితమే బయటకు రాగా ఆ తర్వాత అతను వేరు వేరు కామెడీ షోస్ లో చేస్తూ వచ్చాడు.
అయితే జబర్దస్త్ లో జరుగుతున్న లొసుగుల గురించి ఆర్పీ బయట పెట్టే ప్రయత్నం చేశాడు.
అక్కడ ఫుడ్ ఇంకా శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యవహారం అంతా ఆర్పీ చాలా ఫోర్స్ గా చెప్పాడు.అయితే ఆ తర్వాత ప్రస్తుతం జబర్దస్త్ లో చేస్తున్న ఆది, రాం ప్రసాద్ లు వచ్చి ఆర్పీ ఆవేశంలో మాట్లాడాడని.
అతను మాట్లాడినది అంతా అబద్ధమని అన్నారు.ఆ తర్వాత షేకింగ్ శేషు కూడా వేరే ఇంటర్వ్యూలో ఆర్పీపై కామెంట్స్ చేశాడు.అయితే ఆర్పీ మళ్లీ మరో ఇంటర్వ్యూ ఇచ్చి షేకింగ్ శేషుని భూతులు తిట్టాడు.ఆ తర్వాత జబర్దస్త్ ఏడుకొండలు వచ్చి అసలు వీళ్లకి మాట్లాడే అర్హత కూడా లేదు.
జబర్దస్త్ లేకపోతే వీళ్లు లేనేలేరు అంటూ మాట్లాడారు.

ఈ గొడవకి ముగింపు పలకాలని ఆడియెన్స్ కోరుతున్నారు.ఆర్పీ నాగబాబు వదిలిన అస్త్రం అని కొందరు అంటున్నారు.అది నిజం అయినా కాకపోయినా ఇన్ని ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా నడుస్తూ వచ్చిన జబర్దస్త్ షో మీద శ్యాం ప్రసాద్ రెడ్డి మీద ఆర్పీ చేసిన వ్యాఖ్యలు.
అసలు ఈ గొడవకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేలా మెగా బ్రదర్ నాగ బాబు జోక్యం చేసుకుంటే బెటర్ అని కొందరు అంటున్నారు.లేదంటే నిజంగానే ఆర్పీ వెనక నాగబాబు ఉండి ఈ మాటలు మాట్లాడించారని అనుకుంటారని అంటున్నారు.
మరి ఈ గొడవలపై నాగబాబు వర్షన్ ఎలా ఉంటుందో చూడాలి.