వాచిపోయేలా వాయించిన ఎమ్మెల్యే రోజా.. వీడియో వైరల్!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రోజా గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది.

 Jabardasth Fame Mla Roja Video Clipping Goes Viral-TeluguStop.com

తన అందంతో కూడా బాగా ఆకట్టుకుంది.ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఇక బుల్లితెరపై కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరగా ఉంది.మరోవైపు రాజకీయ పరంగా కూడా బాగా యాక్టివ్ గా ఉంది రోజా.

 Jabardasth Fame Mla Roja Video Clipping Goes Viral-వాచిపోయేలా వాయించిన ఎమ్మెల్యే రోజా.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా ముందుంటుంది.ఇదిలా ఉంటే వాచిపోయేలా వాయించి వైరల్ గా మారింది.

1991లో సర్పయాగం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వరుసగా దాదాపు 100 సినిమాలలో నటించింది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా నటించింది రోజా.వయసు పెరుగుతున్న కొద్దీ వయస్సుకు తగ్గట్టు పాత్రలలో కూడా నటించింది.సినీ ఇండస్ట్రీకి దూరమైన కూడా బుల్లితెరలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ లో జడ్జిగా చేస్తుంది.అంతేకాకుండా బతుకు జట్కబండి వంటి షోలను కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇండస్ట్రీ పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.అంతే కాకుండా ప్రజలకు తన వంతు బాధ్యతను అందిస్తుంది.ఇక తాజాగా నగరి నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా కొందరు డప్పులు వాయించారు.ఇక రోజా కూడా ఒక డప్పును తీసుకొని వాచిపోయేలా తెగ వాయించింది.దీంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన రోజా అభిమానులు తెగ కామెంట్స్, లైక్స్ చేస్తున్నారు.

ఇక గతంలో కూడా పర్యటనలో భాగంగా మోటార్ బైక్ నడుపుతూ బాగా ఆకట్టుకుంది.ఇలా రోజా నటిగానే కాకుండా ప్రజల మనిషిగా కూడా ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకుంది.

#Jabardast #Soical #Roja Drums #Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు