బిగ్ బాస్ 4 లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్.. మరి పారితోషకం ఎంతనో తెలుసా..?!

బిగ్ బాస్ ఫీవర్ మొదలైపోయింది.ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

 Jabardasth Fame Avinash Remuneration For Bigg Boss4 , Big Boos 4, Telugu, Jabard-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 4కు టాలీవుడ్ మన్మధుడు హోస్ట్ గా వ్యవహరించడంతో ఈ షోను ఆడియన్స్ బాగానే తిలకిస్తున్నారు.అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ సెలిబ్రిటీస్ ఎవరూ హౌస్ లో లేకపోవడం వలన భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కానీ రోజురోజుకీ టీఆర్పి పెరుగుతుండటం చూసి బిగ్ బాస్ మంచి ఖుషీగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇకపోతే, జబర్దస్త్ కమెడియన్ లో ఒకడైన ‘ముక్కు అవినాష్’ అందరికీ తెలిసే ఉంటుంది.

ఇతగాడు ఈ షోలో ఉంటాడని చాలా రోజుల నుంచి విస్తృత ప్రచారం జరిగింది.కాబట్టి షో స్టార్ట్ అయ్యాక ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి రావటం జరగదని అంతా అనుకున్నారు.

ఇక ఈ షో స్టార్ట్ అయిన 4 రోజులకు అవినాష్, కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నారనే ప్రచారం కూడా ఒకవైపు జరిగింది.
ఇలాంటి సమయంలో ‘కుమార్ సాయి’ ఒక్కడే హౌస్ లోకి రావడంతో ఇక అవినాష్ రాడని అంతా అనుకుంటుండగా బిగ్ బాస్ లోకి ‘జోకర్’ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు అవినాష్.

ఇతడు జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా పాజిటివ్ వైబ్స్ సంపాదించాడు.అయితే ఇతగాడు ఆ షోకు డబ్బులు కట్టి మరీ వచ్చాడని అంతా అనుకుంటున్నారు.లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని ఇపుడు అతని పారితోషికం విని అంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు.
బిగ్ బాస్ వారం రోజులకు గాను వారికి 5 లక్షలు పారితోషికం ఇస్తున్నట్టు భోగట్టా.

అయితే ఈ షోలోకి రావడానికి ఒప్పందం ప్రకారం జబర్దస్త్ కి 10 లక్షలు కట్టాడట అవినాష్.అయితే ఇదేమంత గొప్ప విషయం కాదని చెవులు కొరుక్కుంటున్నారు కొంతమంది.

ఎందుకంటే.ఈ షోలో అవినాష్ కనీసం 10 వారాలు ఉన్న, లెక్క ప్రకారం 50 లక్షలు వస్తాయి కనుక జబర్దస్త్ కి 10 లక్షలు చెల్లించడం పెద్ద గొప్పేం కాదని అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube