విష్ణుప్రియ చెల్లితో ఆ పని చేసిన ఇమ్మాన్యుయేల్.. వర్ష కోపంతో..?

బుల్లితెరపై ఈ మధ్య కాలంలో పాపులారిటీ సంపాదించుకున్న జోడీగా వర్ష ఇమ్మాన్యుయేల్ జోడీ పేరు తెచ్చుకుంది.ఈ జోడీ ఒకరిపై మరొకరు వేసుకునే పంచ్ లు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వడంతో పాటు స్కిట్లపై ఆసక్తిని పెంచుతున్నాయి.

 Jabardasth Emmnuel Reel With Vishnupriya Sister Pavani And Varsha Reaction, Emma-TeluguStop.com

సుధీర్ రష్మీ జోడీకి ఈ జోడీ ఒక విధంగా గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం.తెలుగులో సంవత్సరాల తరబడి మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న జబర్దస్త్ షోలో సుధీర్ రష్మీ జోడీ తరువాత ఆ స్థాయిలో ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీ ఫేమస్ అయింది.

తక్కువ సమయంలోనే తన కామెడీ టైమింగ్ తో ఇమ్మాన్యుయేల్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.ఆదిలా స్కిట్లలో ఎక్కువగా పంచ్ లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇమ్మాన్యుయేల్ స్కిట్లు బాగా చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

ఇమ్మాన్యుయేల్ బాగా పాపులారిటీని సంపాదించుకోవడానికి అతని కలర్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.ఈ జోడీపై ఇతర కమెడియన్లు వేసే పంచ్ లు ఈ జోడీకి ఊహించని స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెట్టాయి.

అయితే ఎప్పుడూ వర్షతో కనిపించే ఇమ్మాన్యుయేల్ తాజాగా విష్ణుప్రియ చెల్లితో కలిసి ఇన్ స్టాగ్రామ్ రీల్ చేశారు.

విష్ణుప్రియ సోదరి ఈ మధ్య కాలంలో షోలు, ఈవెంట్లలో సందడి చేస్తూ పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇమ్మాన్యుయేల్ పావనితో కలిసి రెడ్డిగారి అమ్మాయిరా అనే సాంగ్ కు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ రీల్ చేయగా వర్ష మాత్రం ఇమ్మాన్యుయేల్ ను కోపంతో వెక్కిరించింది.

ఇమ్మాన్యుయేల్ బిక్కమొహం వేయడంతో పావని ఒక దెబ్బ వేయగా వర్ష కూడా ఇమ్మాన్యుయేల్ పై మరో దెబ్బ వేయడం గమనార్హం.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి చేస్తున్న అల్లరి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube