జబర్దస్త్ చిన్నారి దీవెన ఒక డైలాగ్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా.?       2018-07-06   02:13:33  IST  Raghu V

జబర్దస్త్’ ఈ టీవీలో ప్రసార మయ్యే ఒక కామెడీ షో. ఇది భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమం. అవకాశాలు లేని సమయంలో ఎందరికో తోడు నిలిచింది ఈ ప్రోగ్రాం..ఈ ప్రోగ్రాంలో క్లిక్ అయ్యాక మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది..ధనరాజ్,వేణు,శకలక శంకర్,చంటి వీళ్లందరితోపాటు మరికొందరు జబర్దస్త్ ద్వారా ఫేమ్ లోకి వచ్చినవారే.. ఇప్పుడు దీవెన అనే చిన్నారి జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయింది.మరి ఆ చిన్నారి ఒక ఎపిసోడ్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

జబర్దస్త్’ కార్యక్రమంలో ఎటువంటి స్కిట్స్ చేయాలి. ఆ స్కిట్స్ లో ఎవరిని తీసుకోవాలి. వంటి విషయాలను మల్లెమాల వారు టీమ్ లీడర్స్ కి అప్పగించారు. ఆ విషయంలో టీం లీడర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రతీ స్కిట్ కి సంబంధించిన బడ్జెట్ సైతం టీం లీడర్లకే ఇవ్వడంతో ఆ బడ్జెట్ లోనే అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ మధ్య జబర్దస్త్ లో దీవెన అనే ఓ బుడ్డి పాప రాకింగ్ రాకేష్ స్కిట్ లో తెగ ముద్దొస్తోంది. తన వచ్చీరాని డైలాగులతో తెగ నవ్విస్తోంది. చిట్టి పొట్టి మాటలతో ప్రత్యేక ఆకర్షణగా మారింది.అంతేకాదు కాన్సెప్ట్ లు లేక తెరమరుగు కాబోతున్న రాకింగ్ రాకేష్ ను దీవెనతో పాటు ఇంకో ఇద్దరు చిన్నపిల్లలే లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారనేది కూడా ఎంతో నిజం. రాకేష్ కూడా ప్రతీ స్కిట్ లో ఇదే అంశాన్ని రిపీట్ చేస్తూ ఉంటాడు కూడా.. ఇక ఏది ఏమయినా రాకేష్ తో పాటు ఆ ముగ్గురు పిల్లలు కలిసి ఓ డిఫరెంట్ స్టయిల్ లో వెళ్తూ నవ్వులు పూయిస్తున్నారు.

టీమ్ లీడర్స్ సీనియర్ ఆర్టిస్ట్ లను తీసుకువస్తే వారికీ ఎక్కువగా డబ్బులు ఇవ్వవలసి వస్తుందని కొంత మంది సీనియర్స్,కొంత మంది కొత్తవారిని తీసుకోని స్కిట్స్ చేస్తూ రక్తి కట్టిస్తున్నారు.ఇక రాకింగ్ రాకేష్ విషయానికి వస్తే.. ఇతను చాలా డిఫెరెంట్ గా చిన్న పిల్లలను తీసుకువచ్చి స్కిట్స్ చేస్తున్నాడు. ఆ స్కిట్స్ కూడా బాగా విజయవంతం అయ్యాయి. ఇలా రాకేష్ చాలా తక్కువ బడ్జెట్ తో స్కిట్స్ ని ముగించేస్తున్నాడు.

ఇక రాకేష్ టీంలో చేసే దీవెన విషయానికి వస్తే ఆ పాప తల్లిదండ్రులు అసలు ఏ రెమ్యునరేషన్ వద్దని కమిట్ అయ్యారట. ‘మా అమ్మాయి టాలెంట్ ఎలివేట్ అయితే చాలు.. చాలా చిన్న వయసు.. సినిమా అవకాశాలు వస్తే తిరుగులేని భవిష్యత్ ఉంటుంది..’ అనే కాన్సెప్ట్ లో వారున్నారట. వారు ఆశించినట్లుగానే దీవెన తన హావభావాలు, డైలాగ్ డెలివరీతో జబర్దస్త్ లో పాపులారిటీ సంపాదించేసింది. మరిన్ని అవకాశాలతో తన ఫ్యూచర్ బాగుండాలని కోరుకుందాం. ఇలాంటి దీవెన లాంటి వారికి ‘జబర్దస్త్’ వంటివి మంచి ప్లాట్ ఫామ్ గా నిలుస్తున్నాయి.