జబర్దస్త్ హైపర్ ఆది ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇదే...

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుని సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు హైపర్ ఆది.జబర్దస్త్ షో ద్వారానే గుర్తింపును సంపాదించుకున్న పరదేశి హైపర్ ఆది హోమ్ టూర్ వీడియో చేశారు.

 Jabardasth  Hyper Aadi Home Tour With Paradesi,hyper Aadi Home Tour , Paradesi,h-TeluguStop.com

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో హైపర్ ఆది ఇంట్లో 90 గదులు ఉన్నాయని ఆయన ఇల్లు ఇంద్రభవనం అని పేర్కొనడంతో ఆయన పరదేశి హైపర్ ఆది హోమ్ టూర్ వీడియో చూసి ఆయన ఇంటికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసేలా చేశారు.పరదేశి లైఫ్ స్టైల్ గురించి చెప్పాలని ఆదిని అడగగా లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ లైఫ్ గురించి తనేం రాశానో తెలుసుకోవాలని “లైఫ్ ఈజ్ లైక్ ఎ కెమెరా ఫోకస్ క్యాప్చర్ డెవలప్” అనే కొటేషన్ ను చూపించారు.

తన దృష్టిలో లైఫ్ కు ఇంతకు మించిన మీనింగ్ లేదని ఆది అన్నారు.గోడకు ఉన్న డిజైన్ ను చూపిస్తూ అక్కడ ఉండేది భవిష్యత్తులో తనకు పుట్టబోయే కొడుకు అని.వాడికి చందమామను తెస్తానని చూపించడానికి ఆ డిజైన్ వేయించానని తెలిపారు.అదే డిజైన్ లో ఉన్న పాప ఎవరని పరదేశి అడగగా నాకు పుట్టబోయే వాడికి లవర్ అని ఆది చెబుతారు.

ఆ తరువాత ఆది తనకు గిటార్ వచ్చని గిటార్ వాయిస్తారు.

కిచెన్ ను చూపిస్తూ తనకు వంటలు రావని రోజూ వంటావిడ వంట చేసి పెడుతుందని ఆది అన్నారు.కిచెన్ తో తనకు పెద్దగా పని ఉండదని తెలిపారు.ఆ తరువాత స్కిట్లు రాసే ప్లేస్ ను కూడా చూపించి ఆ ప్లేస్ లో ప్రశాంతత వస్తుందని అన్నారు.

ఈ మధ్య కాలంలో తెలియని నంబర్ల నుంచి ఎక్కువగా మెసేజ్ లు వస్తున్నాయని.తన మొబైల్ ఫోన్ లో ఉన్న నంబర్లకు మాత్రమే రిప్లై ఇస్తున్నానని ఆది అన్నారు.

తెలియని నంబర్ల నుంచి వస్తున్న కాల్స్ వల్ల రెండు మూడు సినిమాలను కూడా మిస్ అయ్యానని హైపర్ ఆది తెలిపారు.యూట్యూబ్ లో అందరూ అనుకుంటున్న ఇంద్ర భవనం ఇదేనని ఆది తెలిపారు.

తనకు సొంతూరిలో ఉన్న ఇల్లు ఎక్కువగా ఇష్టమని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube