పెళ్లికి పనికిరారు అంటున్నారు.. జబర్దస్త్ కమెడియన్స్ ఆవేదన!

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ కామెడీ షోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఎంతో మంది కమెడియన్లు జబర్దస్త్ షో తమకు లైఫ్ ఇచ్చిందని ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు.

 Jabardasth Comedians Shocking  Comments In Cash Show, Jabardasth Comedians ,lady-TeluguStop.com

ఈ షోలో స్కిట్లలో కొంతమంది కమెడియన్లు లేడీ గెటప్స్ లో కనిపిస్తూ ఉంటారు.ప్రేక్షకులు సైతం వాళ్లను లేడీ గెటప్స్ లో తప్ప ఒరిజినల్ గెటప్స్ లో గుర్తు పట్టలేరు.

అయితే లేడీ గెటప్స్ వల్ల క్రేజ్ వచ్చినా తమకు సమాజంలో అవమానాలు ఎదురవుతున్నాయని కమెడియన్లు చెబుతున్నారు.

ఎప్పుడూ లేడీ గెటప్పుల్లో కనిపిస్తూ ఉండటంతో కొంతమంది తమపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారని.

లేడీ గెటప్ లు తమకు గుర్తింపుతో పాటు బాధ కూడా తెస్తున్నాయని వాపోతున్నారు. యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కు జబర్దస్త్ లో లేడీ గెటప్పులు వేసే కమెడియన్లు హాజరయ్యారు.

క్యాష్ ప్రోమో విడుదల కాగా అందులో కమెడియన్లు లేడీ గెటప్ లలో కనిపించడంతో పాటు ఒరిజినల్ గెటప్స్ లో కూడా కనిపించారు.

ప్రోగ్రామ్ లో సుమ శాంతి స్వరూప్ ను పెళ్లి గురించి అభిప్రాయం చెప్పమని అడగగా శాంతి స్వరూప్ మేం లేడీ గెటప్పులను కడుపు కోసం, ఫ్యామిలీని పోషించుకోవడానికి వేస్తామని అన్నారు.అయితే మేం లేడీ గెటప్పులు ఎక్కువగా వేయడంతో కొంతమంది అలా మారిపోయారని అనుకుంటున్నారని చెప్పారు.మేం ప్రొఫెషన్ పరంగా లేడీ గెటప్స్ వేసుకుంటున్నామని ఒరిజినల్ గా కాదు అని అర్థం చేసుకునే వాళ్లు ఉంటే పెళ్లి చేసుకుంటామని శాంతి స్వరూప్ బాధ పడ్డారు.

మిగతా కమెడియన్లు మాట్లాడుతూ బయటకు వెళ్లిన సమయంలో కొందరు అసహ్యంగా మాట్లాడతారని ఆ విషయాలు చెప్పుకోలేమని అన్నారు.తమకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదని రోడ్డుపై వెళుతుంటే విచిత్రంగా చూస్తారని చెప్పుకొచ్చారు.కమెడియన్లు కష్టాలు చెబుతుంటే యాంకర్ సుమ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube