జబర్దస్త్ కమెడీయన్స్ కు అతని వల్ల ఎఫెక్ట్ పడనుందా.. వారి పరిస్థితేంటి?

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల క్రితం మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్మిస్తూ ఎంతోమంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పాలి.

 Jabardasth Comedians Like Venu Wonders Dhanadhan Dhanraj Chammak Chandra All These Are Now In Troubles , Comedy Stars,venu Wonders ,dhana Dhan Dhanraj, Jabardasth , Chammak Chandra , Raghu , Naga Babu-TeluguStop.com

సినిమాలలో ఏ మాత్రం అవకాశాలు లేనటువంటి ధన్ రాజ్, వేణు, రఘు వంటి కమెడియన్స్ ను పిలిచి మరి ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించారు మల్లెమాల సంస్థ.ఇలా ఈ కార్యక్రమంలో వీరందరూ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగి మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లి పోతున్నట్లు ప్రకటించారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరికి ఏ విధమైనటువంటి సినిమా అవకాశాలు లేదా ఇతర షోలో కూడా అవకాశాలు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లారు.అదే సమయంలోనే జబర్దస్త్ కార్యక్రమం నుంచి నాగబాబు కూడా బయటకు వచ్చేశారు.

 Jabardasth Comedians Like Venu Wonders Dhanadhan Dhanraj Chammak Chandra All These Are Now In Troubles , Comedy Stars,venu Wonders ,dhana Dhan Dhanraj, Jabardasth , Chammak Chandra , Raghu , Naga Babu-జబర్దస్త్ కమెడీయన్స్ కు అతని వల్ల ఎఫెక్ట్ పడనుందా.. వారి పరిస్థితేంటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా వీరిద్దరూ కలిసి అదిరింది అనే షో ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే అత్యధిక రేటింగ్స్ తో జబర్దస్త్ కార్యక్రమం దూసుకుపోతున్న సమయంలో అలాంటి తరహా కార్యక్రమాన్ని ప్రేక్షకులు చూడలేక పోవడంతో అదిరింది కార్యక్రమం ఒక సంవత్సరానికి పూర్తి అయ్యింది.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఎంతోమంది కమెడియన్స్ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.ఇలా బయటకు వచ్చిన వారు ఏం చేయాలో తోచని నేపథ్యంలో స్టార్ మాలో కామెడీ స్టార్స్ ధమాకా అనే కార్యక్రమం ద్వారా వీరందరూ మరోసారి ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక పోతే ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా నాగబాబు కూడా రావడం విశేషం.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా కిరాక్ ఆర్పీ, ధనా ధన్ రాజు,వేణు, చమ్మక్ చంద్ర,ముక్కు అవినాష్ వంటి వాళ్ళు ఈ కార్యక్రమం వారు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ విధంగా వీరందరూ భూమి గుండ్రంగా తిరిగి తిరిగి ఒకే చోటకు చేరుకున్నట్టు వీళ్ళందరూ కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి తిరిగి అందరూ ఒకే కామెడీ షో కి వచ్చారు.ఈ కార్యక్రమానికి నాగబాబు జడ్జిగా వ్యవహరించడం, తరచూ మల్లెమాల వారు రాయించుకున్న అగ్రిమెంట్ గురించి ప్రస్తావించడం చూస్తుంటే ఇతని వల్ల తిరిగి జబర్దస్త్ కమెడియన్స్ పై ఏదైనా ప్రభావం చూపించనుందా….ఒకవేళ అదే జరిగితే వీరి పరిస్థితి ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసిన వీరిద్దరూ తిరిగి కామెడీ స్టార్ కార్యక్రమంలో సందడి చేసినా జబర్దస్త్ కార్యక్రమం అంత కలలేదని చెప్పాలి.

Jabardasth Comedians Entry in Star Maa Comedy Stars Dhamaka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube