జబర్దస్త్‌తో బాలయ్య కొత్త సినిమాను నింపేయబోతున్న బోయపాటి  

Jabardasth Comedians In Balakrishna Movie With Director Boyapati-jabardasth Comedians,jabardasth Comedians In Balakrishna Movie

నందమూరి బాలకృష్ణ ఈనెల 20న రూలర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్‌ చాలా నమ్మకంగా చెబుతున్నారు.అయితే బాలయ్య సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గుతుందని, ఉన్నా చాలా పాత చింతకాయ పచ్చడి వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి సమయంలో బాలయ్యతో తదుపరి చిత్రంను తెరకెక్కించబోతున్న బోయపాటి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు.

Jabardasth Comedians In Balakrishna Movie With Director Boyapati-jabardasth Comedians,jabardasth Comedians In Balakrishna Movie Telugu Tollywood Movie Cinema Film Latest News-Jabardasth Comedians In Balakrishna Movie With Director Boyapati-Jabardasth

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య కొత్త సినిమాను వచ్చే నెలలో పట్టాలెక్కించబోతున్నారు.బోయపాటి దర్శకత్వంలో ఇప్పటికే బాలయ్య సింహా మరియు లెజెండ్‌ చిత్రాలు చేశాడు.ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అందుకే మూడవ సారి హిట్‌ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈసారి బాలయ్య సినిమాను పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేయాలని బోయపాటి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్‌ నుండి దాదాపు అయిదు ఆరుగురు కీలకమైన కమెడియన్స్‌ను బాలయ్య సినిమాలో నటింపజేయబోతున్నాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.బాలయ్య సినిమా యాక్షన్‌ మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుందని చెప్పేందుకు జబర్దస్త్‌ కమెడియన్స్‌ను బోయపాటి తీసుకు వస్తున్నాడు.మరి ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

సింహా మరియు లెజెండ్‌ సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటే యాక్షన్‌ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు.కాని ఈసారి మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారు.మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.