జబర్దస్త్ కమెడియన్ కు చుక్కలు చూపిస్తున్న భార్య..?

కొన్ని సందర్భాల్లో చేసిన చిన్నచిన్న తప్పులే పెద్దపెద్ద సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి.సామాన్యులతో పోలిస్తే సెలబ్రిటీలు మాట్లాడే మాటల విషయంలో కానీ చేసే పనుల విషయంలో కానీ మరింత అప్రమత్తంగా ఉండాలి.

 Jabardasth Comedian Wife Amulya Reveals Secrets About Her Husband, Jabardasth Co-TeluguStop.com

ఇష్టానుసారం వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీంలో కంటెస్టెంట్ అయిన దొరబాబు కొన్ని రోజుల క్రితం ఒక తప్పు చేసి పోలీసులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత దొరబాబును జబర్దస్త్ షో నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.హైపర్ ఆది స్కిట్లలో దొరబాబు చేసిన తప్పు గురించి కామెంట్లు చేస్తూ కామెడీ పండిస్తూ ఉంటాడు.

ఈటీవీ ఛానల్ లో సుమ యాంకర్ గా చేసే క్యాష్ ప్రోగ్రామ్ కు దొరబాబు అతని భార్య అమూల్యతో కలిసి హాజరయ్యారు.ఈ ప్రోగ్రామ్ లో అమూల్య మాట్లాడుతూ తన భర్తకు ఇంట్లో చుక్కలు చూపిస్తానని చెప్పింది.
అందరూ తన భర్త ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవడం గమనించే ఉంటారని.తాను కొట్టిన దెబ్బలు కనపడకుండా, రక్కిన గాట్లు తెలియకుండా ఉండటం కొరకు తన భర్త అలాంటి షర్ట్స్ ధరిస్తాడని చెప్పింది.

దీంతో షోలో పాల్గొన్న సుమతో పాటు ఇతర కంటెస్టెంట్లు సైతం అవాక్కయ్యారు.అయితే అమూల్య షోలో ఫన్ కోసమే అలా చెప్పారే తప్ప నిజ జీవితంలో వీళ్లు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

దొరబాబు రైడింగ్ లో దొరికిపోయిన సమయంలో కూడా తన భర్తపై అందరూ విమర్శలు చేసినా ఆమె మాత్రం భర్తను పల్లెత్తు మాట కూడా అనలేదు.దొరబాబు కమెడియన్ గా సక్సెస్ కావడంలో అమూల్య పాత్ర ఎంతో ఉంది.

భర్త తప్పు చేశాడని తెలిసినా దొరబాబుపై విమర్శలు చేసిన వాళ్లపై సీరియస్ అయ్యి తన భర్తపై తనకు నమ్మకం ఉందని ఆమె గతంలో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube