జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అసలు పేరు మీకు తెలుసా?

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరు.ఈటీవీ ఛానల్ లో ఏ షో జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా ఆ షోలో సుడిగాలి సుధీర్ తప్పనిసరిగా ఉంటాడనే సంగతి తెలిసిందే.

 Jabardasth Comedian Sudigali Sudheer Real Name Details Here , Details Here, Jaba-TeluguStop.com

సుడిగాలి సుధీర్ వల్లే ఈటీవీలో ప్రసారమవుతున్న షోలకు మంచి టీఆర్పీ రేటింగ్ లు వస్తున్నాయి.సుడిగాలి సుధీర్ టీవీ షోలకు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

కెరీర్ తొలినాళ్లలో మ్యాజిక్ లు చేసి ఎన్నో కష్టాలు పడిన సుధీర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.సోషల్ మీడియాలో సైతం కళ్లు చెదిరే స్థాయిలో సుడిగాలి సుధీర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇతర ఛానెల్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నా సుధీర్ మాత్రం ఈటీవీ కార్యక్రమాలతోనే బిజీ అవుతున్నారు.అయితే సుడిగాలి సుధీర్ అసలు పేరు సుధీర్ అనే చాలామంది అనుకుంటారు.

సుధీర్ కుటుంబ సభ్యులు మాత్రం అతడిని సిద్ధూ అనే పిలుస్తారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సుడిగాలి సుధీర్ సోదరి హాజరు కాగా ఆమె చిన్నప్పటి నుంచి తమ్ముడిని సిద్ధూ అనే పిలుస్తున్నామని చెప్పుకొచ్చారు.

సినిమాలతో పాటు సుధీర్ షోలు కూడా చేస్తుండటం గమనార్హం.సుధీర్ కు మరోవైపు సినిమాల్లో ఆఫర్లు కూడా వస్తున్నాయి.

సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలలో సుధీర్ ఇప్పటికే హీరోగా నటించారు.

Telugu Jabardast-Movie

ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా సుధీర్ కు మాత్రం హీరోగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.రష్మీ సుధీర్ కాంబినేషన్ లో కూడా రాబోయే రోజుల్లో ఒక సినిమా రానుందని తెలుస్తోంది.రష్మీ సుధీర్ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube