సుజాతను అందుకే ప్రేమించా.. షాకింగ్ విషయాలను వెల్లడించిన రాకేష్!

జబర్దస్త్ లో ఇతర కమెడియన్లతో పోల్చి చూస్తే రాకింగ్ రాకేష్ చాలా విషయాల్లో విభిన్నమనే సంగతి తెలిసిందే.రాకింగ్ రాకేష్ స్కిట్లు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి.

 Jabardasth Comedian Rocking Rakesh Unexpected Comments On Jordar Sujatha , Rakesh , Sujata Rakesh Marriage , , Engagement , Jordar Sujatha , Shocking Comments , Sujatha , Jabardasth Comedian Rocking Rakesh-TeluguStop.com

రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతతో ప్రేమలో ఉన్నారని గత కొన్ని నెలలుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.కొంతమంది రాకేశ్ టీవీ షోల రేటింగ్ కోసం ప్రేమలో ఉన్నానని చెబుతున్నారని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే కొన్ని రోజుల క్రితం రాకేష్ కు సుజాతకు ఎంగేజ్మెంట్ జరిగిందంటూ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.అయితే ఒక ఇంటర్వ్యూలో రాకేశ్ మాట్లాడుతూ ప్రేమకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Jabardasth Comedian Rocking Rakesh Unexpected Comments On Jordar Sujatha , Rakesh , Sujata Rakesh Marriage , , Engagement , Jordar Sujatha , Shocking Comments , Sujatha , Jabardasth Comedian Rocking Rakesh -సుజాతను అందుకే ప్రేమించా.. షాకింగ్ విషయాలను వెల్లడించిన రాకేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేను ఎప్పుడూ సంతోషంగా, బాగా ఉండాలని కోరుకునే వాళ్లలో సుజాత ఒకరని రాకేష్ చెప్పుకొచ్చారు.వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి సంబంధమైన విషయాల్లో కూడా ఆమె సలహాలు ఇస్తుందని రాకేష్ చెప్పుకొచ్చారు.

సుజాతతో తాను ప్రేమలో ఉండటం వాస్తవమేనని రాకేష్ చెప్పుకొచ్చారు.నేను బాగుండాలని కోరుకునే సుజాతతో బంధం ముందుకు వెళ్లినా సంతోషమేనని రాకేష్ కామెంట్లు చేశారు.సుజాత రాకేశ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాల్సి ఉంది.వీళ్లిద్దరూ కలకాలం సంతోశంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.అటు రాకేష్ కు ఇటు సుజాతకు బుల్లితెరపై మంచి గుర్తింపు ఉంది.

Telugu Jordar Sujatha, Rakesh, Sujata Rakesh, Sujatha-Movie

వీళ్లిద్దరూ కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నా రాకేష్ మాత్రం జబర్దస్త్ షోకు పరిమితమయ్యారని సమాచారం అందుతోంది.జబర్దస్త్ షో ద్వారా రాకేష్ ఆర్థికంగా స్థిరపడ్డారని సమాచారం.

రాకేష్, సుజాత త్వరగా పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవనం సాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.వీళ్ల పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి అంగీకారం లభించిందని సమాచారం అందుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube