హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఎవరో తెలుసా?  

Jabardasth Comedian Raghava Under Quarantine - Telugu Comedian, Corona Virus, Jabardasth, Quarantine, Raghava

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నుండి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.ఈ లాక్‌డౌన్ ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

 Jabardasth Comedian Raghava Under Quarantine

కాగా సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితం అయ్యి, తమను తాము క్వారంటైన్ చేసుకుంటున్నారు.కాగా కొంతమంది సెలబ్రిటీలు తమకు కరోనా సోకిందేమోననే భయంతో ఇలా చేస్తున్నారు.

అయితే బుల్లితెరపై కామెడీ షో జబర్దస్త్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ కమెడియన్.. ఎవరో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఈ కామెడీ షోతో చాలా మంది కమెడియన్స్ తమ కెరీర్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

అయితే లాక్‌డౌన్ ప్రభావంతో ఈ కమెడియన్స్‌కు పనిలేక ఇంటికే పరిమితం అయ్యారు.కాగా తాజాగా లాక్‌డౌన్‌లో సడలింపులు దొరకడంతో కమెడియన్స్ తమ స్వస్థలాల నుండి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ రాఘవ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం శివారులోని రాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ వైద్యాధికారులు రాఘవ ఆరోగ్య పరిస్థితి పరీక్షించారు.ఈ క్రమంలో అతడికి కరోనా నెగెటివ్‌గా ఉండటంతో అతడిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు.

ఈ మేరకు అతడికి స్టాంప్ వేసిన అధికారులు హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అతడికి వివరించారు.ఏదేమైన తన ఆరోగ్యం పట్ల వైద్యాధికారులు చూపిన శ్రద్ధకు రాఘవ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా ఈ వార్త తెలుసుకుని పలువురు జబర్దస్త్ షో నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు.అయితే రాఘవకు కరోనా నెగెటివ్ ఉందని తెలుసుకుని వారు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రతి ఒక్కరూ హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jabardasth Comedian Raghava Under Quarantine Related Telugu News,Photos/Pics,Images..