కేసిఆర్ సారూ… కరోనా శవాల పట్ల కొంచెం కనికరం చూపమనండి…  

Racha ravi, jabardasth comedian, Tollywood, corona virus, Corona virus Dead body Funerals, KCR, TRS, Telangana - Telugu Corona Virus, Corona Virus Dead Body Funerals, Jabardasth Comedian, Kcr, Racha Ravi, Telangana, Tollywood, Trs

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే  జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు తన  స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన రచ్చ రవి కరోనా వైరస్ సోకి  మృతి చెందిన వ్యక్తుల మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించే విధి విధానాల పట్ల తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించాడు.

 Jabardasth Comedian Racha Ravi React About Corona Dead Body Funerals

అయితే ఇందులో కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారిని ఖననం చేసే ముందు సైంటిస్టులు మరియు వైద్య నిపుణులతో సహాయంతో ఒక స్పెషల్ బాక్స్ ని తయారు చేయించి మృతదేహాన్ని మృతుల కుటుంబీకులకు అప్పజెప్పాలని ఇలా చేయడం వల్ల చాలామంది ఈ మహమ్మారి వైరస్ సోకి మరణించిన వారి కుటుంబ సభ్యులు చివరి చూపుకైనా నోచుకుని ఖననం చేస్తారని లేదా మృతదేహాన్ని మళ్ళీ వైద్యాధికారుల అప్పగిస్తారని అన్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ మీద ఉన్న భయంతో అంత్యక్రియలకు మృతుల కుటుంభం సభ్యులను రానివ్వడం లేదు.

కేసిఆర్ సారూ… కరోనా శవాల పట్ల కొంచెం కనికరం చూపమనండి…-Latest News-Telugu Tollywood Photo Image

ఇలా చేయడం వల్ల ఎంతోమంది కరోనా మృతుల కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు.తాను చెప్పినట్లు చేయడం వల్ల ఎంతో మందికి మేలు కలుగుతుందని కాబట్టి ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని కోరాడు.

దీంతో కొందరు నెటిజన్లు రచ్చ రవి చేసినటువంటి ఈ వీడియోకి మద్దతుగా నిలుస్తున్నారు.మానవుని అంత్యక్రియల విషయంలో అతడి కుటుంబ సభ్యులు వారి వారి ఆచారాలను బట్టి అంత్యక్రియలు నిర్వహిస్తారని కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అలాంటి ఆచారాలు పాటించకుండా అంత్యక్రియలు నిర్వహించడం వల్ల  మృతి చెందిన వారి ఆత్మ ఘోషిస్తునందని కామెంట్లు చేస్తున్నారు.

మరి ఈ విషయంపై కేసిఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

#KCR #Corona Virus #Telangana #TRS #Racha Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jabardasth Comedian Racha Ravi React About Corona Dead Body Funerals Related Telugu News,Photos/Pics,Images..