సొంత అన్న కాళ్లపై పడ్డ జబర్దస్త్ కమెడియన్.. ఏం జరిగిందంటే..?

బుల్లితెరపై నంబర్ 1 యాంకర్ గా రెండు దశాబ్దాల నుంచి యాంకర్ సుమ కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.తాజాగా సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ వారం ఎపిసోడ్ కు జబర్దస్త్ కమెడియన్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

 Jabardasth Comedian Nukaraju Prasad Shared Their Emotioanl Journey In Cash Show,-TeluguStop.com

ఇమ్మాన్యుయేల్, బాబు, నూకరాజు, ప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి క్యాష్ షోలో సందడి చేశారు.నూకరాజు తన అన్న గొప్పదనం గురించి షోలో ఎమోషనల్ అయ్యారు.

తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చినప్పటికీ నేను అన్నయ్య కాళ్లు పట్టుకుంటానని నూకరాజు అన్నారు.అన్నయ్య జీవితాన్ని త్యాగం చేయడం వల్లే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని నూకరాజు అన్నారు.

తన ఉద్యోగం వదిలేసి తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి వారిని చూసుకున్నాడని నూకరాజు చెప్పుకొచ్చారు.భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తల్లిదండ్రులకే తన సమయాన్ని కేటాయించాడని నూకరాజు అన్న గొప్పదనం గురించి చెప్పారు.

తన కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతో కెరీర్ నే తన అన్న త్యాగం చేశారని నూకరాజు తెలిపారు.తమ్ముడు తన గురించి గొప్పగా చెప్పడంతో నూకరాజు అన్న కన్నీటి పర్యంతమయ్యారు.మరో కమెడియన్ ప్రసాద్ తనను మామయ్య పెంచారని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మా నాన్న చిన్నప్పుడు చనిపోయారని ఆయన చనిపోయినా మామయ్య ఏ లోటు లేకుండా చూసుకున్నారని ప్రసాద్ అన్నారు.

తన మేనమామ వల్లే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని ప్రసాద్ అన్నారు.మామయ్య సహాయం చేయకపోతే ఇంకా గొప్ప పొజిషన్ లో ఉండేవాన్నేమో అంటూ లాస్ట్ లో వెరైటీ పంచ్ వేసి ప్రసాద్ నవ్వించారు.జులై 17వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.జబర్దస్ కమెడియన్ల ఫ్యామిలీ మెంబర్స్ సైతం తమదైన శైలిలో పంచ్ లు వేసి ప్రోమోలో నవ్వించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube