ఆడిషన్స్ కు వెళ్తే నన్ను తోసేశారు.. జబర్దస్త్ నూకరాజు వైరల్ కామెంట్స్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ నూకరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట పటాస్ షో ద్వారా కెరిర్ ను ప్రారంభించిన నూకరాజు ఆ తర్వాత తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.

 Jabardasth Comedian Nookaraju Shares About His Television Field Career , Jabarda-TeluguStop.com

ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.మొదట తాను ఈటీవీలో జబర్దస్త్ షో చూసి అక్కడికి వెళ్లి వాళ్లను చూసి, కలిస్తే చాలు అని అనుకునేవాడిని, వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ చిన్న చిన్న జోకులు వేస్తూ ఉంటే వాళ్ళు ఇండస్ట్రీ కి వెళితే బాగుంటుంది అని చెప్పారని, మా ఫ్రెండ్స్ చెప్పినదాన్ని గురించి నేను కూడా బాగా ఆలోచించి హైదరాబాద్ కు వచ్చాను అని తెలిపారు నూకరాజు.

హైదరాబాద్ కి వచ్చిన తర్వాత చాలా ఆడిషన్స్ కి వెళ్లాను.కొందరు వెళ్ళిపోమని చెప్పగా మరికొంతమంది అయితే తోసేశారు.కొందరు నానారకాలుగా మాట్లాడి అవమానించాడు అని తెలిపాడు.అలా ఫైనల్ గా జీ తెలుగు లో ప్రసారం అవుతున్న కిలాడి కామెడీ షో లో అవకాశం రాగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న నూకరాజు ఆ తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదట.

అలా పటాస్ షో అయిన తర్వాత, జబర్దస్త్ షో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో అవకాశాలు రావడంతో బిజీ బిజీ గా మారాడట.

Telugu Carrier, Hijra Character, Jabardasth, Kiladi Show, Nooka Raju, Patas, Sri

ఒకసారి జబర్దస్త్ లో హిజ్రా క్యారెక్టర్ చేసిన తర్వాత మంచి పేరు వచ్చిందని ఆ తర్వాత నుంచి తనకు పెద్ద పెద్ద క్యారెక్టర్ అని చెప్పుకొచ్చాడు నూకరాజు.అయితే మొదట జబర్దస్త్ లో ఒక స్కిట్ చేస్తే చాలు అనుకునే వాడిని ఇప్పుడు ఎన్నో స్కిట్లు చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది.అలాగే చంటి అన్నకు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు క్లిప్పులు కూడా నేనే రాస్తున్నాను.

సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే నేను బుల్లితెర విడిచి పెట్టను అని చెప్పుకొచ్చాడు నూకరాజు.అలాగే తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి అని కోరిక అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube