మొత్తానికి కాబోయే భార్య ఫేస్ రివిల్ చేసిన కెవ్వు కార్తీక్... వైరల్ అవుతున్న ఫోటోలు?

Jabardasth Comedian Kevvu Karthik Introduces His Fiance Details, Jabardasth , Comedian Kevvu Karthik, Siri, Marriage, Kevvu Karthik Wife, Kevvu Karthik Fiance, Kevvu Karthik Marriage, Kevvu Karthik Siri, Jabardasth Comedian Kevvu Karthik

జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ కెవ్వు కార్తీక్ (Kevvu Karthik) ఒకరు.జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కార్తీక్ ప్రస్తుతం పలు బుల్లి తెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

 Jabardasth Comedian Kevvu Karthik Introduces His Fiance Details, Jabardasth , Co-TeluguStop.com

ఇకపోతే కార్తీక్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ తనకు కాబోయే భార్యను ఇదివరకు పరిచయం చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలలో ఎక్కడ కూడా కార్తీక్ తనకు కాబోయే భార్య ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు.

ఇలా తనకు కాబోయే భార్య ఫేస్ కనపడకుండా ఫోటోలు షేర్ చేసినటువంటి ఈయన తాజాగా తనకు కాబోయే భార్య ఫేస్ రివిల్ చేశారు.ఇలా తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తనని అందరికీ పరిచయం చేశారు.

అంతేకాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన కార్తీక్ ఒక రొమాంటిక్ కొటేషన్ కూడా షేర్ చేశారు.ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పెళ్లిళ్లు(Marriages) స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది.

ఫైనల్లీ ఆమె ఈమెనే నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు.లవ్ యూ సిరి (Love You Siri) అంటూ కార్తీక్ తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈయన ఈ ఫోటో షేర్ చేయడంతో తనకు కాబోయే భార్య పేరు సిరి (Siri) అని అర్థం అవుతుంది.

అయితే ఆమె ఏం చేస్తుంది ఏంటీ అనే వివరాలు తెలియాల్సి ఉంది.ఇక కార్తీక్ ఎంటెక్ పూర్తి చేసి మిమిక్రీలో కూడా డిప్లమా పూర్తి చేశారు.అయితే ఈయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నప్పటికీ మిమిక్రీపై, కామెడీ పై ఆసక్తి ఉండడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి కెరియర్ మొదట్లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా అవకాశం అందుకొని కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube