ఆ చిల్లరతో జీవితం మొదలైందంటూ 'రెమ్యూనరేషన్'పై క్లారిటీ ఇచ్చిన కెవ్వు కార్తీక్..?

జబర్దస్త్ ద్వారా సెలబ్రేటీగా మారిన కమెడియన్ కెవ్వు కార్తిక్.తన కామెడీతో మంచి గుర్తింపు అందుకున్నాడు.

 Jabardasth, Comedian Kevvu Karthik, Remunaration, Team Leader, Barth Day Event,-TeluguStop.com

ఒక సాధారణ టీమ్ మెంబర్ గా పరిచయమైన కెవ్వు కార్తిక్ ఆ తర్వాత తన టాలెంట్ తో టీమ్ లీడర్ గా నిలిచాడు.మొదట్లో కొన్ని టీమ్ లల్లో కమెడియన్ గా పరిచయమయ్యాడు.

టీమ్ లీడర్ గా రావడానికి మాత్రం చాలా ఆలస్యంగా వచ్చాడు.తనకంటూ సొంతంగా స్క్రిప్టు రాస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉంటే తన జీవితం రెమ్యూనరేషన్ విషయంలో ఎలా మొదలైందో కొన్ని విషయాలు పంచుకున్నాడు కార్తీక్.

Telugu Kevvu Karthik, Jabardasth-Movie

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ తన జీవితం గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.మొదట తన కెరీర్ ను చిన్న చిన్న ఈవెంట్లలో మిమిక్రీ చేసుకుంటూ మొదలు పెట్టాడట.అందులో కేవలం 200 రూపాయలు మాత్రమే తను సంపాదించేవాడట.

ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులు జాబ్ చేశానని తెలిపాడు.ఇక ఇంట్లో ఆర్థికంగా కాస్త ఇబ్బందులు కలగడంతో ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టాడట కార్తీక్.

ఇక ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి 1500 రూపాయల పారితోషికంతో ఈవెంట్స్ చేశాడట.Telugu Kevvu Karthik, Jabardasth-Movie

ఆ తర్వాత వరంగల్ లో ఓ బర్త్ డే ఈవెంట్ లో తన జీవితం మొత్తం మారిందని తెలిపాడు.అక్కడ అందరికీ తన కార్డ్స్ ఇవ్వడంతో కొన్ని నెలల్లోనే తన సంపాదన లక్షల రూపాయలు దాటిందని తెలిపాడు కార్తీక్.అంతేకాకుండా పలు ఈవెంట్లలో టాప్ సింగర్స్ తో కూడా పాటలు పాడించారట.ఇక జబర్దస్త్ లో అడుగుపెట్టాక మళ్లీ అటు వైపు వెళ్లకుండా తన టాలెంట్ ను ఇక్కడే నిరూపించుకున్నాడట.

మొత్తానికి జబర్దస్త్ తనకు మంచి లైఫ్ ఇచ్చిందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube