హైపర్ ఆది అసలు పేరేంటో తెలుసా మీకు..?!

బుల్లితెరపై అతి తక్కువ కాలంలో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అందులో మొదటగా నిలిచేది హైపర్ ఆది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం లో కనపడే హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Jabardasth Comedian Hyper Aadi Real Name, Hyper Aadi Real Name,jabardasth, Hyper-TeluguStop.com

జబర్దస్త్ షోను చాలామంది హైపర్ ఆది వేసే పంచుల కోసమే చూసే వారు ఎందరో ఉన్నారు.ఇకపోతే ఆయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.

వీలు దొరికినప్పుడల్లా మెగా హీరోలపై తన అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు ఆయన.తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశాడు.ఇక అసలు విషయంలోకి వెళితే.

ఈ కార్యక్రమంలో తాను జబర్దస్త్ కామెడీ షో కు రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో చర్చించాడు.

అలాగే తన కుటుంబ నేపథ్యం గురించి కూడా చర్చించాడు.ఇకపోతే ఆది అసలు పేరు ఏమిటి అని ఎక్కడ వినింది లేదు.

అయితే ఈ కార్యక్రమంలో మాటల్లో సందర్భంగా హైపర్ ఆది తన అసలు పేరును తెలిపాడు. జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది గా పరిచయమైన ఆయన అసలు పేరు ఏంటో ఎట్టకేలకు తెలిపాడు.

హైపర్ ఆది అసలు పేరు ఆదయ్య.ఈ పేరు తన తాతగారిది అని ఆయన పేరే తనకు తల్లిదండ్రులు పెట్టినట్లు తెలిపాడు.

ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన ఆదయ్యను కాస్త ఆదిగా మార్చుకునట్లు తెలిపాడు హైపర్ ఆది.

ఇక ఆ తర్వాత జబర్దస్త్ లో చేసే కామెడీ చూసి ఆ కార్యక్రమం డైరెక్టర్స్ తనకి తన పేరు ముందర హైపర్ అనే పేరును చేర్చారని తెలిపాడు.ఇక అప్పటి నుంచి తన పేరు హైపర్ ఆదిగా మారిందని తెలిపాడు.మరోవైపు హైపర్ ఆది తన పెళ్లి విషయం గురించి తెలుపుతూ.ప్రస్తుతం కేవలం తన కెరీర్ పైనే దృష్టి పెట్టినట్లు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తెలిపాడు.దీంతోపాటు ప్రస్తుతం తన జీవితం సోలో బ్రతుకే సో బెటర్ అంటూ తెలిపాడు.

వీటితో పాటు తాను ఇండస్ట్రీకి వచ్చే సమయంలో కొంత మంది చేతిలో మోసపోయిన సంగతి కూడా తెలియజేశారు.నిజానికి సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే అంత ఆషామాషీ విషయం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube