జబర్దస్త్ ఫహీమా ఎవరో మీకు తెలుసా.. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే..?

జబర్దస్త్ షో ద్వారా మేల్ కమెడియన్లే ఎక్కువగా గుర్తింపును సంపాదించుకోగా ఈ మధ్య కాలంలో ఫిమేల్ కమెడియన్లు కూడా గుర్తింపును సంపాదించుకుంటున్నారు.జబర్దస్త్ షోలో కామెడీ టైమింగ్ ద్వారా ఫహీమా మంచి పేరును సంపాదించుకున్నారు.

 Jabardasth Comedian Faima Real Back Ground Details Here, Faheema, Back Ground De-TeluguStop.com

జబర్దస్త్ షోతో పాటు ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఇతర షోలలో కూడా ఫైమా కనిపిస్తున్నారు.మారుమూల పల్లెటూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి ఫహీమా ఈ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు.

తనపై ఇతర కమెడియన్లు పంచ్ లు వేసినా ఫహీమా స్పోర్టివ్ గా తీసుకుంటూ ఉండటం గమనార్హం.గతంలో ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమైన పటాస్ 2లో షోలో కూడా ఫహీమా పాల్గొన్నారు.

ఫైమా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ఆమె పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా అక్కల పెళ్లిళ్ల కొరకు చేసిన అప్పులను తీర్చడానికి ఫహీమా ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే కామెడీ షో ఆఫర్ల ద్వారా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఫహీమా అనుకుంటున్నారు.తన కుటుంబానికి అండగా నిలవాలని ఆమె భావిస్తుండటం గమనార్హం.

పటాస్ 2లో వచ్చిన పాపులారిటీ ఆమెకు జబర్దస్త్ షోలో అవకాశాలను తెచ్చిపెట్టింది.నూకరాజు, ఇమ్మాన్యుయేల్ టీమ్ లలో ఫహీమా వేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Telugu Ground, Faheema, Jabardasth-Movie

ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకున్న ఫహీమా ప్రస్తుతం వారానికి 50,000 రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్యలో పారితోషికం తీసుకుంటారని తెలుస్తోంది.ఫహీమా ప్రేమలో పడ్డారని కొన్ని రీజన్స్ వల్ల ప్రేమించిన వ్యక్తితో ఆమెకు బ్రేకప్ అయిందని తెలుస్తోంది.ఈమెకు లవ్ ప్రపోజల్స్ కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చాయని తెలుస్తోంది.ఫహీమా ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు మరో మూడు షోలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube