జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో చమ్మక్ చంద్ర ఒకరనే సంగతి తెలిసిందే.చమ్మక్ చంద్ర నిజామాబాద్ లోని బాన్సూవాడ దగ్గర వెంకటాపూర్ అనే తండాకు చెందిన వారు.
హీరోలు ఎవరనేది చూడకుండా కమెడియన్లను చూసి సినిమాలకు వెళ్లేవాడినని చమ్మక్ చంద్ర తెలిపారు.చిరంజీవి పాటలకు డ్యాన్ చేసేవాడినని చమ్మక్ చంద్ర అన్నారు.
ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకున్నానని చమ్మక్ చంద్ర వెల్లడించారు.ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడే ఛాన్స్ లు రావడం తేలిక కాదని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
ఫాదర్ రైతు అని అమ్మ అంగన్ వాడీ టీచర్ అని చమ్మక్ చంద్ర వెల్లడించారు.తనకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని మాకు బర్రెలు ఉండేవని బర్రెల పాలు అమ్మి తిండి తినేవాళ్లమని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
అలాంటి కష్టాలు అనుభవించానని చమ్మక్ చంద్ర అన్నారు.
తాను పదో తరగతి ఫెయిల్ అయ్యానని చమ్మక్ చంద్ర తెలిపారు.
ఊర్లోకి వెళ్లడానికి కూడా భయపడిన రోజులు ఉన్నాయని చమ్మక్ చంద్ర వెల్లడించారు.నా దగ్గర 10 రూపాయలు ఉండేవని బియ్యం కొంటే పావు కిలోనే వచ్చేవి కాబట్టి నూకలు కొనేవాడినని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
నూకలు కొనుక్కుంటే నాలుగు రోజులు తినవచ్చని భావించే అవే తిన్నానని చమ్మక్ చంద్ర పేర్కొన్నారు.

కడుపులో ఆకలిమంట రాకూడదని చిన్నప్పుడు మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదని చమ్మక్ చంద్ర వెల్లడించారు.రేషన్ బియ్యం ఐదారు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకునేవాళ్లమని చమ్మక్ చంద్ర అన్నారు.చిన్నప్పుడు రొట్టెలు తినేవాడినని అన్నం కూడా తనకు లేదని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
ప్రస్తుతం చమ్మక్ చంద్ర సినిమాలకు, షోలకు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.జబర్దస్త్ కు చమ్మక్ చంద్ర 4 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారని సమాచారం.