నన్ను ఘోరంగా అవమానించారు.. అదిరే అభి సంచలన వ్యాఖ్యలు..?

పదుల సంఖ్యలో సినిమాల్లో కమెడియన్ గా నటించడంతో పాటు జబర్దస్త్ షోలో టీమ్ లీడర్ గా చేసి అదిరే అభి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం జబర్దస్త్ షోలో పంచ్ లు వేస్తూ పాపులారిటీ ని సంపాదించుకున్న హైపర్ ఆదికి మొదట జబర్దస్త్ షోలో చాన్స్ ఇచ్చింది అదిరే అభి కావడం గమనార్హం.

 Jabardasth Comedian Adire Abhi Emotional Experience His Insults, Adhira Abhi, Ja-TeluguStop.com

అయితే పేరు, గుర్తింపు ఉన్న ఈ నటుడు తనకు ఇండస్ట్రీలో అవమానాలు తప్పడం లేదని చెబుతున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అదిరే అభి కెరీర్ తొలినాళ్లలో, ఈ మధ్య కాలంలో ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చారు.

చదువుకునే సమయంలో ఎస్టీడీ బూత్ లో పని చేశానని, ట్యూషన్లు కూడా చెప్పేవాడినని ఆ విధంగా తాను పాకెట్ మనీ సంపాదించుకున్నానని అదిరే అభి తెలిపారు.ఆర్థికపరమైన సమస్యలు తనకు లేవని గతంలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసిన సమయంలోనే ఇల్లు కట్టుకున్నానని అదిరే అభి అన్నారు.

Telugu Adhira Abhi, Adhireabhi, Eeshwar, Jabardasth, Tollywood, Vira-Movie

ఈశ్వర్ సినిమా హీరో స్నేహితుని పాత్ర కోసం 40 మందిని పిలవగా తాను ఎంపికయ్యానని అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని అదిరే అభి అన్నారు.ఆ మూవీ షూటింగ్ సమయంలో లంచ్ బాక్స్ తీసుకుని తింటున్నానని ఆ సమయంలో ఫైట్ మాస్టర్ వచ్చి షాట్ ఉందని పిలిచాడని ఆ సమయం అన్నం తినకుండా ప్లేట్ పక్కన పెట్టి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.ఈ విధంగా తనను ఘోరంగా అవమానించారని అదిరే అభి చెప్పుకొచ్చారు.ఈ మధ్య కాలంలో తనను ఒక స్టూడియో మేనేజర్ అవమానించాడని కారు బయట పెట్టాలని చెబుతూ రెచ్చిపోయాడని పేర్కొన్నారు.

మరి కొందరు జబర్దస్త్ షో చూడనే చూడమనే విధంగా మాట్లాడతారని సుధీర్, రష్మీ మధ్య లవ్ ట్రాక్ నిజమేనా అని అడుగుతారని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube