ఆది అందుకే నా టీమ్ నుంచి వెళ్ళిపోయారు.. అభి షాకింగ్ కామెంట్స్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం మొదట్లో కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన స్కిట్ ల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అదిరే అభి గురించి అందరికీ తెలిసిందే.

 Adhire Abhi Shocking Comments On Hyper Aadi Details, Adhi, Aadi, Tollywood, Jaba-TeluguStop.com

ఈయన కెరియర్ మొదట్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ తన ఉద్యోగం నచ్చక పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.అనంతరం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా అభి ఎంతోమంది కొత్తవారికి జబర్దస్త్ వేదికపై అవకాశం కల్పించారు.

ఈ విధంగా అభి అవకాశం కల్పించిన వారిలో హైపర్ ఆది ఒకరు.ఫేస్ బుక్ ద్వారా హైపర్ ఆది టాలెంట్ గుర్తించిన అభి తనని పిలిపించి తన టీమ్ లో చేర్చుకున్నారు.

అదేవిధంగా మేము స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హైపర్ ఆది మధ్యలో వచ్చి కొన్ని సలహాలు సూచనలు చేయటం వల్ల అతనిని స్క్రిప్ట్ రైటర్ గా కూడా పెట్టుకున్నామని వెల్లడించారు.ఈ విధంగా హైపర్ ఆది అభి టీంలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

అయితే కొద్దిరోజులకు హైపర్ ఆది అభి టీమ్ నుంచి వెళ్ళిపోయి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసుకున్నారు.

Telugu Aadi, Adhi, Adhire Abhi, Hyper Aadi, Hyperaadi, Jabardast Show, Jabardast

ఈ క్రమంలోనే హైపర్ ఆది అభి మధ్య మనస్పర్ధలు రావడం వల్లే ఆది తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై తాజాగా అభి స్పందిస్తూ మా మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదని జబర్దస్త్ వాళ్ళు మరొక కొత్త టీమ్ కావాలంటే హైపర్ ఆది తన టీమ్ నుంచి పక్కకు వెళ్ళాడని అంతకుమించి ఎలాంటి గొడవలు లేవని అభి వెల్లడించారు.అయితే ప్రస్తుతం హైపర్ ఆది, అదిరే అభి ఇద్దరు కూడా జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడం గమనార్హం.

అదిరే అభికి పలు సినిమా అవకాశాలు రావడంతో ఆయన జబర్దస్త్ వీడి వెళ్లారని వెల్లడించారు.హైపర్ ఆది మాత్రం జబర్దస్త్ కార్యక్రమాన్ని విడిచి వెళ్లడానికి గల కారణం ఏంటో ఇప్పటివరకు తెలియజేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube