జబర్దస్త్ స్టేజి మీద సీరియస్ అయిన అదిరే అభి... దాంతో రోజా...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ లో ప్రతి గురువారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇటీవలే వచ్చే గురువారం రోజున ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోని ఇటీవలే షో నిర్వాహకులు యూట్యూబ్ లో విడుదల చేశారు.

 Jabardasth Comedian Adhire Abhi Serious On Production Boy, Adhire Abhi, Jabardas-TeluguStop.com

అయితే ఈ ప్రోమోలో చివరగా ప్రముఖ  కమెడియన్ “అదిరే అభి” ప్రోమో ని ఒకసారి పరిశీలించినట్లయితే అదిరే అభి మొదటగాఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న “ప్రముఖ సింగర్ మనో” ని ఇంటర్వ్యూ చేస్తూ తన స్కిట్ ని మొదలు పెడతాడు.

ఈ క్రమంలో ప్రొడక్షన్ బాయ్ వచ్చి స్టేజి మీద ఉన్నటువంటి కుర్చీను తీసుకెళుతుండగా ఒక్కసారిగా అదిరే అభి సీరియస్ అయ్యాడు.దీంతో టీం మెంబర్స్ మరియు రోజా కూడా అదిరే అభి ని కూల్ కూల్ అంటూ శాంత పరచడానికి ప్రయత్నించినప్పటికీ  అభి మాత్రం చాలా సీరియస్ గా ప్రొడక్షన్ భాయ్ కి వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీంతో షూటింగులలో ప్రొడక్షన్ బాయ్స్ చాల కష్ట పడుతుంటారని దాంతో అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరుగుతాయని అంత మాత్రాన అందరి ముందు సీరియస్ ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 మరి కొందరు మాత్రం కేవలం ప్రోమోలో భాగంగానే అదిరే అభి అలా చేసి ఉంటాడని అసలు నిజం తెలియకుండా అతడిపై నెగిటివ్ ట్రోల్స్ చేయడం సరికాదని అంటున్నారు.

Telugu Adhire Abhi, Jabardasth, Point Blank, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అదిరే అభి జబర్దస్త్ లో కమెడియన్ గానే కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేస్తూ బాగానే రాణిస్తున్నాడు.అంతేకాక తెలుగులో ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహించిన “పాయింట్ బ్లాక్” అనే చిత్రంలో హీరోగా పూర్తయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రం విడుదలను కొంతకాలంపాటు తాత్కాలికంగా నిలిపివేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube