పెళ్లికొడుకుగా మారిన జబర్దస్త్ అవినాష్.. వధువు ఆమేనా..?

జబర్దస్త్ షో ద్వారా భారీ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న అవినాష్ కొన్ని కారణాల వల్ల ఆ షోకు దూరమై ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోతో బిజీగా ఉన్నారు.బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడం అవినాష్ కెరీర్ కు ప్లస్ అయిన సంగతి తెలిసిందే.

 Jabardasth Avinash  Pic Create Row On His Marriage, Comedy Stars , Create Row ,-TeluguStop.com

అరియానాతో లవ్ ట్రాక్ వల్లే బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ ఎక్కువ వారాలు ఉన్నాడనే కామెంట్లు వినిపించాయి.అయితే తాజాగా అవినాష్ పెళ్లికొడుకు గెటప్ లో దర్శనమిచ్చారు.

అవినాష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లికొడుకు గెటప్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.దీంతో అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నారా.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే నెటిజన్లు మాత్రం కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ కొరకు అవినాష్ పెళ్లికొడుకు గెటప్ వేసి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు.

అవినాష్ స్పందిస్తే మాత్రమే ఆ గెటప్ కు అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

Telugu Stars, Create Row, Emanuel, Sridevidrama, Trp, Varsha-Movie

అవినాష్ కామెడీ స్టార్స్ షోలో ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.జులై 4వ తేదీన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వర్ష, ఇమ్మాన్యుయేల్ పెళ్లి జరుగుతున్నట్టు ఇప్పటికే ప్రోమోలు రిలీజయ్యాయి.అదే రోజున అవినాష్ పెళ్లికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ప్రసారమవుతుందేమో చూడాల్సి ఉంది.

అయితే పెళ్లిని అపహాస్యం చేసే విధంగా చేస్తున్న ప్రోగ్రామ్ లపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Stars, Create Row, Emanuel, Sridevidrama, Trp, Varsha-Movie

టీవీ ఛానెళ్లు ఈ మధ్య కాలంలో ప్రముఖ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ టీఆర్పీ రేటింగ్ లు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.లేదా అవినాష్ నిజంగానే పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇస్తాయేమో చూడాల్సి ఉంది.వర్ష కూడా కొన్నిరోజుల క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీ షో కోసం ఇదే తరహాలో ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube