వర్మ కేసీఆర్ జబర్దస్త్ నటుడేనా! టాలీవుడ్ లో హాట్ టాపిక్  

కేసీఆర్ పాత్రలో జబర్దస్త్ మహేష్. .

Jabardasth Artist Main Lead In Kcr Biopic-jabardasth Mahesh,main Lead In Kcr Biopic,ram Gopal Varma,rgv,tollywood

వర్మ ఈ మధ్య హర్రర్ వదిలేసి బయోపిక్ ల మీద పడ్డాడు. తన పబ్లిసిటీ కోసం ఎప్పుడు ఏదో ఒక విషయంపై హడావిడి చేసే వర్మ కొద్ది రోజుల క్రితం వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని తన ప్రమోషన్ కోసం వాడుకున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్ లోకి వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకుంది..

వర్మ కేసీఆర్ జబర్దస్త్ నటుడేనా! టాలీవుడ్ లో హాట్ టాపిక్-Jabardasth Artist Main Lead In KCR Biopic

ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ అంటూ కేసీఆర్ బయోపిక్ మీద ద్రుష్టి పెట్టాడ. తాజాగా సినిమా టైటిల్ ని టైగర్ కేసీఆర్ అంటూ అనౌన్స్ చేసాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ పాత్ర కోసం వర్మ ఎవరిని రంగంలోకి దించుతున్నాడు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ పాత్ర కోసం ఓ రంగస్థల నటుడిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే జబర్థస్త్ షోలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి రంగస్థలం, మహానటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్దస్త్ మహేష్‌ను కేసీఆర్ పాత్ర కోసం తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలతో జోరుగా వినిపిస్తుంది. తన సినిమాలో పాత్రల కోసం తెలియని నటులని, అలాగే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ఉన్నవారిని మెయిన్ లీడ్ చేసిన సందర్భాలు ఆర్జీవి కెరియర్ లో చాలా ఉన్నాయి.

ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ కోసం జబర్ధస్త్జ్ మహేశ్ ని రంగంలోకి దించుతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.