మల్టీస్టారర్‌లో జబర్దస్త్‌ యాంకర్‌ ఐటెం.. మళ్లీ కుమ్మేయనుందట  

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, వెంకటేష్‌ లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’ లో జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అంచనాు భారీగా ఉన్న విషయం తెల్సిందే. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ చిత్రంలో అనసూయతో ఐటెం సాంగ్‌ చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయంకు అనీల్‌ రావిపూడి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Jabardasth Anchor Anasuya Item Song In F2 Movie-Anchor F2 Movie Hero Venkatesh Jabardasth Varun Tej

Jabardasth Anchor Anasuya Item Song In F2 Movie

గతంలోనే అనసూయ ఐటెం సాంగ్‌ చేసి అలరించిన విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా అరించిన అనసూయ మళ్లీ ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌తో మెప్పించేందుకు సిద్దం అవుతుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా, మూడు పదుల వయస్సు దాటినా కూడా అనసూయ ఇంకా కూడా తన అందాలతో అలరిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రంతో మరోసారి తన అంద చందాలతో అలరించేందుకు అనసూయ సిద్దం అవుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఎఫ్‌ 2 చిత్రంలో అనసూయ పాట తప్పకుండా హైలైట్‌గా నిలుస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Jabardasth Anchor Anasuya Item Song In F2 Movie-Anchor F2 Movie Hero Venkatesh Jabardasth Varun Tej

జబర్దస్త్‌ యాంకర్‌గా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్న అనసూయకు స్టార్‌ ఇమేజ్‌ సొంతం అయ్యింది. జబర్దస్త్‌ కామెడీతో పాటు అనసూయ అందాలకు మంచి పేరు వచ్చింది. అందుకే ఎఫ్‌ 2లో ఆమెతో భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చి మరీ ఐటెం సాంగ్‌ను చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు దిల్‌రాజు ఓకే చెప్పిన కారణంగానే అనసూయ ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మెహ్రీన్‌ పారితోషికంకు కాస్త అటు ఇటుగా అనసూయ రెమ్యూనరేషన్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఎఫ్‌ 2 చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.