రాజకీయాల్లోకి అనసూయ అంటూ జోరుగా ప్రచారం.. నిజమేనా..?

బుల్లితెర యాంకర్ గా అనసూయ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఈవెంట్లు సక్సెస్ కావడానికి, మంచి టీఆర్పీ రేటింగ్ లు సాధించడానికి కారణమవుతున్నారు.

 Jabardasth Anchor Anasuya Bharadwaj Likely To Entry Into Politics,latest Viral N-TeluguStop.com

ఒకవైపు బుల్లితెర షోలతో బిజీగా ఉన్న అనసూయ వెండితెరపైకూడా సత్తా చాటుతున్నారు.ఇప్పటికే అనసూయ కీలక పాత్రల్లో నటించిన కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.

అనసూయ ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో పాటు రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు.మరికొన్ని సినిమాల్లో కూడా అనసూయ నటిస్తున్నట్టు వార్తలు వస్తుండగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అయితే గత మూడు రోజుల నుంచి అనసూయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.బుల్లితెర, వెండితెరపై తనకు ఉన్న క్రేజ్ ను రాజకీయాల్లో వినియోగించుకోవాలని అనసూయ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Telugu Anasuya, Bjp, Jabardasth, Roja-Latest News - Telugu

అనసూయ రాజకీయాల్లోకి వస్తానంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు సైతం ఆసక్తి చూపుతాయి.టాప్ యాంకర్ గా అందం, అభినయంతో ప్రూవ్ చేసుకున్న అనసూయ నిజంగా రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియాల్సి ఉంది.అనసూయ స్పందించి వివరణ ఇస్తే మాత్రమే అనసూయ రాజకీయ ఆరంగేట్రానికి సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.

సినిమా సెలబ్రిటీలలో కొంతమంది రాజకీయాల్లో సక్సెస్ అయితే మరి కొంతమంది మాత్రం సక్సెస్ కాలేదు.

అనసూయ సన్నిహితులతో రాజకీయాల గురించి చర్చించినట్టు ప్రచారం జరుగుతుండగా కొన్ని రోజులు ఆగితే మాత్రమే జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.ఒకవేళ అనసూయ రాజకీయాల్లోకి వెళ్లినా తనకు గుర్తింపును తెచ్చిపెట్టిన జబర్దస్త్ షోను, సినిమాలను వదిలిపెట్టే అవకాశాలు అయితే లేవనే చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube