అందుకే అమ్మాయిగా మారానంటున్న జబర్దస్త్ పింకీ...  

jabardasth actress pinky revealing why he is taking surgery telugustop - Telugu Jabardasth Actress Pinky, Jabardasth Actress Pinky Movie News, Jabardasth Actress Pinky News, Jabardasth Actress Pinky Operation News, Jabardasth Actress Pinky Revealing Why He Is Taking Surgery

తెలుగులో ఎంతగానో పాపులర్ అయినటువంటి జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో మొదట్లో లేడీ గెటప్ లు వేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి సాయి అలియాస్ పింకీ బాగానే గుర్తుంటుంది.అయితే ఇటీవల కాలంలో సాయి పూర్తిగా ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారి ప్రస్తుతం అదిరింది షో లో వేణు వండర్స్ టీమ్ లో అదరగొడుతోంది.

 Jabardasth Actress Pinky Revealing Why He Is Taking Surgery Telugustop

అయితే తాజాగా పింకీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తాను అమ్మాయిగా మారడానికి ఆపరేషన్ చేయించుకున్న మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని అని చెప్పుకొచ్చింది.అయితే ఆ సమయంలో తన స్నేహితులు చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చింది.

అందుకే అమ్మాయిగా మారానంటున్న జబర్దస్త్ పింకీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేగాక తాను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా తన స్నేహితులు తనకు అన్నీ తామై చూసుకున్నారని వారి సేవలు మరువలేనివని చెప్పుకొచ్చింది.అంతేకాక కొందరు తాను అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అది సరికాదని వాపోయింది.

అలాగే తాను డబ్బు సంపాదించడం కోసం అమ్మాయిగా మారానని అనుకుంటున్నారని అందులో ఎటువంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది.అంతేకాక తాను అమ్మాయిగా ఉండాలా.? అబ్బాయిగా ఉండాలా.?  అనేది తన పూర్తి వ్యక్తిగతమని, ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా ఒకరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఇతరులు చాలా ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పింకీ సినిమాల్లో కూడా అడపాదడపా పాత్రలు నటించే అవకాశం దక్కించుకుంది.ఈ మధ్య కాలంలో పలు షార్ట్ ఫిలిం లో కూడా నటించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే కచ్చితంగా నటిస్తానని అందులో ఎటువంటి సందేహం లేదని కూడా చెప్పుకొచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jabardasth Actress Pinky Revealing Why He Is Taking Surgery Telugustop Related Telugu News,Photos/Pics,Images..