జబర్దస్త్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ ఎవరో తేలిపోయింది.. అరెస్ట్‌     2018-07-13   04:11:33  IST  Raghu V

తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బుల్లి తెర కామెడీ షో జబర్దస్త్‌ ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. పదుల సంఖ్యలో కమెడియన్స్‌కు స్టార్‌ గుర్తింపును తెచ్చి పెట్టింది. ఒక్క పూట తిండికి ఇబ్బంది పడ్డ వారు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ, కోట్ల ఖరీదు చేసే కార్లలో జల్సాగా తిరుగుతున్నారు. పలువురు కమెడియన్స్‌కు బ్రేక్‌ ఇచ్చిన జబర్దస్త్‌ ఒక స్మగ్లర్‌ను కూడా తయారు చేసింది అంటూ నిన్న మొన్నటి నుండి మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్‌ కమెడియన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు.

ఆ జబర్దస్త్‌ కమెడియన్‌ ఎవరై ఉంటారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో పోలీసులు అధికారికంగా ఆయన పేరును ప్రకటించారు. తిరుపతి పోలీసులు గత మూడు నాలుగు రోజులుగా వెదుకుతున్న ఆ జబర్దస్త్‌ కమెడియన్‌ దొరికి పోయాడు. పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన నటుడు హరి గత కొన్ని రోజులుగా జబర్దస్త్‌లో లేడీ గెటప్‌తో కామెడీ వేశాలు వేసుకుంటూ వస్తున్నాడు. లేడీ గెటప్‌తో హరి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. జబర్దస్త్‌లో వినోదిని తర్వాత లేడీ గెటప్స్‌కు హరి ఫేమస్‌ అయ్యాస్‌.

Jabardasth' Actor Hari Turns Most-wanted Red Sanders Smuggler-

Jabardasth' Actor Hari Turns Most-wanted Red Sanders Smuggler

జబర్దస్త్‌తో వచ్చిన ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని ఈయన రెడ్‌ సాండల్‌ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడు. పలువురు జూనియర్‌ ఆర్టిస్టుల సాయంతో ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఉద్యోగులను డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన హరి తాజాగా ఎర్రచందనం కేసులో ఉన్నట్లుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. పూర్తి సాక్ష్యాధారాలు సంపాదించిన తర్వాత హరి పేరును పోలీసులు వెళ్లడి చేయడం జరిగింది.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసి వచ్చిన డబ్బును పలు సినిమాలకు ఫైనాన్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే షకలక శంకర్‌ హీరోగా తెరకెక్కిన శంభో శంకర చిత్రంకు కూడా హరి భారీ మొత్తంలో ఫైనాన్స్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. పలు విధాలుగా హరి ఎర్రచందనం అమ్మిన డబ్బులను ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు హైదరాబాద్‌లో హరిని అదుపులోకి తీసుకున్నారు. హరికి సంబంధించిన పలు విషయాలను పోలీసులు త్వరలోనే వెళ్లడిచేసే అవకాశం ఉంది. జబర్దస్త్‌ను అభిమానించే ప్రేక్షకులకు ఇది షాకింగ్‌ అని చెప్పుకోవచ్చు.