బుల్లితెర లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ షో ఎన్నో సంవత్సరాల నుండి ప్రసారమవుతుండగా ఇందులో పాల్గొన్న ఎంతోమంది కమెడియన్స్ వెండితెరపై కూడా పలు అవకాశాలు అందుకున్నారు.
తమకంటూ ఓ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.పలువురు కమెడియన్స్ వల్ల ఈ షో వ్యతిరేకమైన విమర్శలు కూడా అందుకుంది.
ఇదిలా ఉంటే గతంలో ఈ షో లో పాల్గొనే కమెడియన్ వ్యభిచారం కేసులో దొరికిన సంగతి తెలిసిందే.అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది.అంతేకాకుండా పలువురు కమెడియన్స్ కూడా పలు కారణాల వల్ల కేసులో ఇరుక్కున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుక్కయ్యాడు.
ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు.

జబర్దస్త్ లో లేడీ గెటప్ తో అలరించే హరి.గతంలో కూడా ఇతడు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు.ఇక ఇటీవలే చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అధికారుల పర్యవేక్షిస్తున్న ఈ సమయంలో ఎర్రచందనం స్మగ్లర్ చేస్తున్న 8 మంది దుండగులను పట్టుబట్టారు.
వారి నుండి 2 నాటు తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వీటితో పాటు రూ.3 లక్షల విలువైన ఎర్రచందనం ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ దుండగులతో జబర్దస్త్ హరికి సంబంధాలున్నాయని పోలీసులు తెలుపుతున్నారు.
ఈ స్మగ్లింగ్ ద్వారా చాలా డబ్బులు సంపాదించాడని వార్తలు కూడా వచ్చాయి.ఇక ఈ విషయం బయట పడగా వెంటనే జబర్దస్త్ హరి స్పందించాడు.
ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.ఈ విషయం గురించి తాను పోలీసులకు సమాచారం అందించానని తెలిపాడు.
ఇక ఆ కోపంతో తనపై ఈ తప్పుడు కేసులు పెట్టాడని తెలిపాడు.