చీరలో అందంగా కనిపించిన జబర్దస్త్ వర్ష.. అక్కడికి అలా ఎవరైనా వెళ్తారా ఛండాలంగా అంటూ ట్రోల్స్?

మామూలుగా వెళ్లే ప్రాంతం బట్టి రెడీ అవుతూ ఉంటాం.అంతేకానీ మంచి కార్యానికి ఛండాలంగా, ఇతర వాటికి అందంగా రెడీ అయి వెళ్తే విమర్శలు తప్పవు.

 Jabardast Varsha Looked Beautiful In A Saree Does Anyone Go There And Trolls Lik-TeluguStop.com

ఇది ఎవరికైనా వర్తిస్తూ ఉంటుంది.అయితే కొన్నిచోట్లకు పద్ధతిగా వెళ్లినప్పటికీ కూడా అందులో కాస్త షో చేసినట్లు కనిపిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రం ఈ విషయంలో ముందుంటారు.ఎక్కడికి వెళ్లిన గ్లామర్ షో చేయాలి అని ఫిక్స్ అవుతారు.

అవసరం లేని చోట కూడా షో చేయడం వల్ల బాగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.అయితే తాజాగా జబర్దస్త్ వర్ష అలాంటిదే ఎదుర్కొంది.

అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

బుల్లితెర సీరియల్ నటి, జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

తొలిసారిగా బుల్లితెరపై పలు సీరియల్ లలో నటించింది వర్ష.దీంతో కొంతవరకు మాత్రమే ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయిందో ఇక అప్పటినుంచి జబర్దస్త్ లో కమెడియన్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

దీంతో ఆమెకు జబర్దస్త్ ద్వారా మరింత పరిచయం పెరిగింది.

ఇక అందులో మరో కమెడియన్ ఇమ్మానుయేల్ తో ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.అతనితో ప్రేమించిన అమ్మాయిగా ప్రవర్తిస్తుంది.

నిజానికి వీళ్ళ ప్రవర్తన చూస్తే బాగా మితిమీరి ఉంటుంది.ఇక ఈ షో లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగా సందడి చేస్తుంది వర్ష.

అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్లలో పాల్గొంటే.తన డాన్సులతో, అల్లర్లతో తెగ రచ్చ చేస్తుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎంతలా అంటే ఈమె చేసే గ్లామర్ షో కింద ఏ హీరోయిన్ కూడా పనికిరాదు అన్నట్లుగా చేస్తుంది.

నిజానికి వర్ష చేసే గ్లామర్ షో మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు.

తన అందాలతో కుర్రాళ్లను తన వైపు లాక్కుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.బాగా ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి రచ్చ చేస్తుంది.

ఒకప్పుడు పొట్టి పొట్టి బట్టలతో అలరించిన వర్ష ఇప్పుడు కాస్త పరవాలేదు అన్నట్లుగా ఉంది.బాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది.

అయితే ఈమధ్య చీరలు కట్టిన కూడా అందులో కూడా బాగా షోస్ చేస్తున్నారు సెలబ్రిటీలు.ముఖ్యంగా ధరించే బ్లౌజ్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేరు.రకరకాల డిజైన్స్ తో వీపు అందాలు, ఎద అందాలు కనిపించే విధంగా డిజైన్ చేయించుకుంటున్నారు.అయితే తాజాగా వర్ష కూడా తన వీపు అందాలు కనిపించే విధంగా బ్లౌజ్ ధరించి చీర కట్టుకొని అందంగా కనిపించింది.

అయితే తను చీర కట్టుకొని స్కూల్లో ఒక సినిమా పాటకు వీడియో చేసింది.తన చుట్టూ స్కూల్ పిల్లలు, కూల్ వాతావరణం కనిపించింది.అయితే ఆమె స్కూల్లో చీర కట్టుకొని కనిపించినప్పటికీ కూడా ఆమె వేసుకున్న బ్లౌజ్ బాగా షో చేసి ఉండటంతో నెటిజెన్స్ బాగా కామెంట్లు పెడుతున్నారు.అలాంటి బ్లౌజ్ వేసుకుని స్కూల్ కి వెళ్తే ఛండాలం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube