ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్.ఎన్నో ఏళ్ళ నుండి ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ఎంతో మంది కమెడియన్స్ ను సెలబ్రేట్ లుగా మార్చింది.
ఇక ఇందులో మొదటి నుండి జడ్జిగా బాధ్యతలు వహిస్తున్న రోజా పరిచయం గురించి అందరికి తెలిసిందే.వెండితెరపై, బుల్లితెరపై కాకుండా రాజకీయ పరంగా కూడా మంచి హోదాలో ఉంది రోజా.
జబర్దస్త్ జడ్జ్ గా చేస్తూ తన పంచ్ లతో బాగా ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా స్కిట్టు లో భాగంగా ముందు గానే డైలాగ్స్ ను నవిసురుతుంది.ఇక గతంలో అనారోగ్య సమస్య వల్ల కొన్ని రోజులు జబర్దస్త్ కి దూరంగా ఉన్నా రోజా మళ్లీ రీ ఎంట్రీ తో తనదైన పంచ్ లతో మళ్లీ తెగ నవ్విస్తుంది.ఇక రోజా జబర్దస్త్ కు కొత్త కొత్త లుక్ తో వస్తూ బాగా ఆకట్టుకుంటుంది.
లేటు వయసులో కూడా అందాలను మరింత పరిచయం చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా పంచ్ లతో మరింత రెచ్చిపోయింది రోజా.
తాజాగా వచ్చే వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో హైపర్ ఆది స్కిట్ హైలెట్ గా మారింది.ఎప్పుడు కొత్త గెస్ట్ లను పరిచయం చేసే ఆది ఈసారి రీతు చౌదరిని గెస్ట్ గా ఆహ్వానించాడు.ఇక ఎంట్రీతో డాన్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు.అంతలోనే పనివాడు క్యారెక్టర్ లో ఉన్న మరో కమెడియన్ రీతూ చౌదరి చేయి పట్టుకుని డాన్స్ చేస్తుండగా అతడిని ఆది కొడుతూ పక్కన నేట్టేసాడు.
ఇక వెంటనే రోజా ‘ఆయన సందులో చించు’ అంటూ పంచ్ వేసింది.
ఇక స్కిట్ లో భాగంగా రీతూ చౌదరి ఆదితో ఏమండీ నా కడుపు పండేలా చూడండి అని అనడంతో.
గోరింటాకు పెట్టండి అని పంచ్ వేసింది రోజా.ఇక అంతలోనే ఆది నేను చెప్పాల్సిన డైలాగ్ నాకంటే ముందే రోజా గారు చెప్పేస్తున్నారు.
చూశావా అంటూ రోజా వైపు చూసి నవ్వుకున్నారు.