ఇలా అయితే కామెడీ ఏం చేస్తాం.. జబర్దస్త్‌ కమెడియన్స్ అసంతృప్తి

ఒకప్పుడు సినిమా ల్లో వివాదాస్పద విషయాలు ఉన్నాయి.అవి మా మనోభావాలు దెబ్బ తీశాయి అనేట్లుగా మాత్రం పెద్దగా వార్తలు వచ్చింది లేదు.

 Jabardast Comedians Unhappy With Small Controversy ,latest News-TeluguStop.com

కాని ఇప్పుడు ఊ అంటే వివాదం ఆ అంటే వివాదం.కామెడీ చేసేప్పుడు కొన్ని సార్లు కొన్ని పదాలు దొర్లుతాయి.

ఆ సమయంలో మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ వివాదం రాజేయడం ఏంటీ అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్‌ కమెడియన్స్ కదిలితే మెదిలితే వివాదం అన్నట్లుగా సాగుతోంది.

ఆమద్య కామెడీ కోసం ఒక కమెడియన్‌ సరదాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు.ఆయన క్షమాపణలు చెప్పేవరకు వదిలి పెట్టలేదు.

సరే తెలియక చేసిన దానికి క్షమాపణ చెబుతున్నా కూడా కొందరు దాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మొత్తానికి జబర్దస్త్‌ కమెడియన్‌ మరియు ఇతర కమెడియన్స్ ఏం కామెడీ చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది.

ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

ఇటీవల జబర్దస్త్‌ లో ప్రముఖ కమెడియన్‌ చేసిన స్కిట్‌ మా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కొందరు ఆరోపిస్తు మీడియా ముందుకు వచ్చారు.వారికి ఇప్పటికే ఆ కమెడియన్‌ క్షమాపణలు చెప్పేందుకు ఒప్పుకున్నాడు.అయినా కూడా వారు మాత్రం ఈ వివాదంను మరింతగా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తెలియక జరిగిన తప్పు.ఆ తప్పుకు క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది.

షో ఆరంభం సమయంలో ఈ షో లోని సంఘటనలు పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు.ఎవరు కూడా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఫీల్‌ అవ్వద్దు అంటూ వేస్తారు.

అయినా కూడా అప్పుడప్పుడు జరిగే ఇలాంటి సంఘటనలతో రెచ్చి పోతూ ఉంటారు.కొన్ని సార్లు మరీ చిన్న చిన్న విషయాలను కూడా బూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం చేస్తున్నారని.

అలా చేయడం వల్ల తాము కామెడీ చేయడం సాధ్యం అవ్వడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube