ప్రదీప్ కోసం సుధీర్ పోరాటం.. అలా చేయవద్దంటూ..?

బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నిన్న విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రదీప్ తొలి సినిమా కావడంతో ఈ సినిమాకు బుల్లితెర యాంకర్లతో పాటు జబర్దస్త్ కంటెస్టెంట్లు కూడా ప్రమోషన్లు చేస్తున్నారు.

 Jabardast Comedian  Sudheer Comments About Piracy, 30 Rojullo Preminchadam Ela,-TeluguStop.com

జబర్దస్త్ కమెడియన్ సుధీర్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా సక్సెస్ అయినందుకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని సూచించారు.

అభిమానులు పైరసీని ఎంకరేజ్ చేయవద్దని పోస్ట్ చేశారు.

ఈ మధ్య కాలంలో సినిమాలు విడుదల కావడం ఆలస్యం కొన్ని వెబ్ సైట్లు ఆ సినిమాలను పైరసీ చేస్తున్నాయి.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాలకు పైరసీ వల్ల భారీగా నష్టం చేకూరుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా పైరసీకి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.పైరసీ వల్ల ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.

Telugu Piracy, Sudheer-Movie

మరోవైపు ఈ సినిమాకు తొలిరోజు కలెక్షన్లు బాగానే వచ్చినా బుల్లితెరపై కామెడీ పంచ్ లు వేస్తూ సక్సెస్ అయిన ప్రదీప్ వెండితెరపై మాత్రం ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి.మరోవైపు హీరోగా అవకాశాలు వస్తున్నా బుల్లితెరపై మాత్రం కొనసాగుతానని ప్రదీప్ చెప్పారు.ప్రదీప్ కు మరికొన్ని సినిమాల్లో కూడా హీరోగా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.గతంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ కూడా హీరోలుగా ట్రై చేసినా సక్సెస్ కాలేకపోయారు.

అయితే ప్రదీప్ సినిమాకు విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడటంతో పాటు భారీగా కలెక్షన్లు వచ్చాయి.ప్రదీప్ తరువాత సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

తనకు సూట్ అయ్యే పాత్రలను ఎంచుకుంటే ప్రదీప్ సినిమాల్లో తప్పకుండా సక్సెస్ అవుతాడని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube